Congress: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేద్కర్‌ను అవమానించినందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తైన ఈ సందర్భంగా పార్లమెంట్ లోని ఉభయ సభల్లో రెండు రోజుల పాటు భారత రాజ్యాంగంపై చర్చ కొనసాగింది.
Read Also: Vemulawada: దారుణ హత్య.. రహదారిపై వ్యక్తిని నరికి చంపిన దుండగులు
కాగా, మంగళవారం నాడు జరిగిన చర్చ సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కాంగ్రెస్‌పై తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం బీఆర్ అంబేద్కర్ పేరును వాడుకుంటుందని అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్ అని జపం చేయడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారిందని ఆయన అన్నారు. అంబేద్కర్ పేరుకు బదులుగా దేవుడి పేరు తలుచుకుంటేనైనా కొంచెం పుణ్యమైన వస్తుంది.. స్వర్గానికి వెళ్లొచ్చని హస్తం పార్టీపై విరుచుకు పడ్డారు.
Read Also: Warangal: బీహార్ యువకుడి దారుణ హత్య
అయితే, అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీతో పాటు ఏఐసీసీ అధినేత మల్లికార్జున్ ఖర్గేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుస్మృతిని విశ్వసించే వారు ఖచ్చితంగా అంబేద్కర్‌తో విభేదిస్తారు అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రాహుల్ గాంధీ రాసుకొచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్‌ను హోంమంత్రి షా అవమానించడంతో బీజేపీ- ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ జెండాకు వ్యతిరేకమని పేర్కొన్నారు.
Read Also:
అలాగే, బీజేపీ- ఆర్ఎస్ఎస్ పూర్వీకులు సైతం అశోక్ చక్రాన్ని వ్యతిరేకించారని.. సంఘ్ పరివార్ ప్రజలు మనుస్మృతిని అమలు చేసేందుకు చూస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. అంబేద్కర్ ఆ దేవుడి కంటే తక్కువేం కాదు.. ఆయన దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, పేదలకు అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. ఇక, అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర హోంమంత్రి తక్షణమే క్షమాపణలు చెప్పాలని రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు నోటీసు ఇచ్చింది.