దేశ తొలి ప్రధాని జవాహర్ లాల్ నెహ్రూను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ప్రధాని మోడీ అభద్రతా భావంతో బాధపడుతున్నారని పేర్కొనింది.. అందుకే నెహ్రూపై రాజకీయంగా కాకుండా వ్యక్తిగతమైన ఆరోపణలు గుప్పిస్తూ.. దుర్మార్గంగా మాట్లాడుతున్నారని హస్తం పార్టీ నేతలు మండిపడతున్నారు. నెహ్రూ గురించి బీజేపీ సీనియర్ నేతలు వాజ్‌పేయీ, అద్వాణి కూడా ఇంత దారుణంగా మాట్లాడలేదు.. కానీ ప్రధాని మోడీ లోక్ సభలో దిగజారి మాట్లాడటం ద్వారా ఉన్నతమైన పదవికి ఉన్న వ్యాల్యూను పొగొట్టుకుంటున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు.
Read Also: NTPC Recruitment 2024: ఎన్‌టీపీసీలో భారీగా ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..
ఇక, నిన్న (సోమవారం) లోక్‌సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధానులు జవాహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే, ఇవాళ రాజ్యసభలో కూడా ప్రధాని మోడీ అలాగే మాట్లాడనున్నారని జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగాలోమానియా, నెహ్రూ ఫోబియా అనే విషపూరిత మిశ్రమం దేశంలో ప్రజాస్వామ్య హత్యకు దారి తీస్తోంది అని ఆయన అన్నారు. అందుకే దేశ యువత లోక్‌సభలో ప్రధాని మోడీకి ఇదే చివరి ప్రసంగం అని అనుకుంటున్నట్లు జైరాం రమేశ్ చెప్పారు. పదేళ్ల పాటు అన్యాయమైన పరిపాలనకు త్వరలో ముగిసిపోతుందని ఆయన జోస్యం చెప్పారు.