PM Modi: దేశంలోని సామాన్య ప్రజల కలలు నెరవేరుతుండటంతో ప్రతిపక్షాలు ఆగ్రహిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా విపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు తమ ప్రభుత్వం ఎంతో కృషిచేసిందని.. అలా చేసి ఉండకపోతే నిత్యావసర ధరలు మరింతగా పెరిగేవన్నారు. ప్రజలను దాహంతో ఉంచినవారు, వారి ఆకాంక్షలు, ఆశలను పట్టించుకోని వారు నేడు ప్రజల కలలు సాకారమవుతుంటే చూసి ఆగ్రహిస్తున్నారంటూ విపక్షాలపై విరుచుకుపడ్డారు. అవినీతి, వారసత్వంతో కూడినవారని విపక్షాల కూటమిని విమర్శించారు.
Read also: Sandra Bullock: హీరోయిన్ బర్త్ డే.. న్యూడ్ వీడియో పంపి విష్ చేసిన హీరో
విపక్షాల కూటమి పేరు మార్చుకుందే తప్ప.. ఆ ముఖాలు పాతవేననన్నారు. ఆ గ్రూపు పద్ధతులు, ఉద్దేశాలు ఒకేలా ఉంటాయని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఎన్‌డీయేను అధికారంలోకి రానీయకుండా నిలువరించేందుకు 26 విపక్ష పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన INDIA కూటమిని ఉద్దేశించి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. సుపరిపాలన హామీతో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే.. వాటినే ఈ తొమ్మిదేళ్లలో అమలు చేసిందన్నారు. ఇంతకుముందు ప్రభుత్వం కొనసాగితే ప్రజలు నెలకు మొబైల్ ఫోన్ బిల్లు రూ.6000 చొప్పున చెల్లించాల్సి వచ్చేదన్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్, క్వాలిటీ ఆఫ్ లైవ్ తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతల్లో ఒకటన్న ప్రధాని.. డిజిటల్ ఇండియాతో సామాన్యుల సమస్యల్నింటినీ పరిష్కరించామన్నారు. కొన్నేళ్లుగా రాజ్‌కోట్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఇప్పుడు సౌరాష్ట్రకు గ్రోత్ ఇంజిన్‌గా గుర్తింపు సాధించిందని ప్రధాని తెలిపారు. ప్రతిపక్షాలు ప్రతి విషయంలోనూ రాజకీయం చేయాలని చూస్తున్నారని అన్నారని విమర్శించారు. ప్రతిదీ రాజకీయం చేయడం మంచిది కాదని విపక్షాలకు ప్రధాని హితవు పలికారు.