Site icon NTV Telugu

Tamil Nadu: ప్రియుడి ఎదుటే కాలేజ్ విద్యార్థిపై గ్యాంగ్ రేప్..

Tamil Nadu Incident

Tamil Nadu Incident

College Student Gang-Raped In Front Of Boyfriend In Tamil Nadu: తమిళనాడులో దారుణం జరిగింది. ప్రియుడి ఎదుటే ప్రియురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగుడు. కాంచీపురం జిల్లాలో ఈ ఘటన జరిగింది. యువకుడు, అమ్మాయి క్లాస్ మేట్స్. వీరిద్దరు ఏకాంతంగా గడిపేందుకు ఓ మారుమూల ప్రాంతానికి వెళ్లారు. ఇది గమనించిన దుండగులు యువకుడిని కొట్టి, కత్తితో బెదిరించి, 20 ఏళ్ల విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.

Read Also: Ban on Kite Flying: ఉదయ్‌పూర్‌లో 144 సెక్షన్.. గాలిపటాలు ఎగురవేయడంపై నిషేధం

గురువారం సాయంత్రం ప్రియుడితో కలిసి కాలేజీ నుంచి బయటకు వెళ్లింది అమ్మాయి. మద్యం మత్తులో మాస్క్ ధరించిన ఇద్దరు వ్యక్తులు, ముందుగా బాధితులిద్దరిని గమనించారు. ముందుగా అమ్మాయి ప్రియుడిపై దాడి చేశారు. ఆ తరువాత మరో నలుగురు వ్యక్తులు ముసుగులు ధరించి, ముందుగా వచ్చిన ఇద్దరు నిందితులతో చేరి మొత్తం ఆరుగురు విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని అధికారులు వెల్లడించారు.

యువతిని కత్తితో బెదిరించి చీకటి ప్రాంతానికి తీసుకెళ్లి, ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. నిందితుల్లో ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆరుగురు నిందితులపై అత్యాచారం, లైంగిక వేధింపులు కేసు నమోదు చేశారు.

Exit mobile version