Coimbatore R*ape Case: సంచలనంగా మారిన కోయంబత్తూరు ఘటన.. విజయ్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Coimbatore R*ape Case: తమిళనాడులో సంచలనం రేపిన కోయంబత్తూరు చిన్నారి అత్యాచారం, హత్య ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దారుణ ఘటన అనంతరం ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదనే ఆరోపణలు రోజురోజుకూ మరింత తీవ్రం అవుతున్నాయి. ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి విజయ్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. చిన్నారి హత్య ఘటనపై స్పందించిన అధికారుల తీరే ఇప్పుడు కొత్త వివాదానికి దారితీసింది.
ప్రెస్మీట్లో నవ్వుతూ మాట్లాడిన అధికారులపై విమర్శలు
ఘటనపై మీడియా సమావేశం నిర్వహించిన ఓ మహిళా పోలీస్ అధికారి నవ్వుతూ మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంత దారుణ ఘటన జరిగిన సమయంలో బాధ్యతాయుతంగా స్పందించకుండా నవ్వుతూ మాట్లాడటంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మహిళా మంత్రులు కీర్తన, జగధీశ్వరీ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కూడా చిరునవ్వులతో కనిపించిన వీడియోలు వైరల్ కావడంతో ప్రభుత్వం మరింత ఇబ్బందుల్లో పడింది.
Also Read
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
- Supreme Court: టెట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
బాధితురాలి తల్లి సంచలన ఆరోపణలు
ఈ ఘటనపై తాజాగా బాధితురాలి తల్లి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తన కుమార్తె మృతదేహాన్ని చివరిసారి కూడా చూడనీయలేదని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. పోస్ట్‌మార్టం అనంతరం తనకు తెలియకుండా మృతదేహాన్ని అంబులెన్స్‌లో వెనుక ద్వారం గుండా తరలించారని, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే దహనం చేశారని ఆమె ఆరోపించింది. తన బిడ్డను చివరిసారి చూసే అవకాశం కూడా ఇవ్వలేదని కన్నీటి పర్యంతమైంది. ఈ ఆరోపణలు బయటకు రావడంతో ప్రభుత్వం వ్యవహరించిన తీరు పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తమిళనాడులో రాజకీయ దుమారం
కోయంబత్తూరు ఘటన ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది.. ప్రభుత్వ వైఖరి, పోలీసుల ప్రవర్తన, బాధిత కుటుంబానికి అందిన న్యాయం వంటి అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ ఘటనపై తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్న దానిపై కూడా ఆసక్తి నెలకొంది. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
తాజావార్తలు
-
Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!