Cockroach Janta Party: “బొద్దింకల పార్టీ”పై ఉక్కుపాదం.. అన్ని అకౌంట్లు క్లోజ్..
- కాక్రోచ్ జనతా పార్టీకి షాక్..
- అకౌంట్లు క్లోజ్, హ్యాకింగ్..
- అభిజిత్ దీప్కేపై అనేక ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cockroach Janta Party: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఇటీవల సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. కేవలం కొన్ని రోజుల్లోనే మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించింది. అయితే, దీని వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే శనివారం మాట్లాడుతూ.. తన సీజేపీపై అణిచివేత చర్యలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. తమ సోషల్ మీడియా అకౌంట్ల తొలగింపు, హ్యాకింగ్ జరుగుతోందని అన్నారు. తమ సోషల్ మీడియా అకౌంట్లకు యాక్సెస్ లేకుండా పోయిందని ఆయన అన్నారు. తన వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా హ్యాక్ అయిందని ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
నీట్ యూజీసీ 2026 పేపర్ లీక్‌పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ శుక్రవారం సీజేపీ ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. దీని తర్వాత తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, బెదిరింపులు వస్తున్నాయని దీప్కే అన్నారు. బెదిరింపులకు సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేసుకున్నారు. తమ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్‌కు యాక్సెస్ లేకుండా పోయిందని, ‘‘కాక్రోచ్ జనతా పార్టీ’’ నుంచి వచ్చిన ఏ ప్రకటనను అధికారిక ప్రకటనగా పరిగణించొద్దని దీప్కే చెప్పారు.
Also Read
ఇదిలా ఉంటే, కాక్రోచ్ జనతా పార్టీపై విమర్శలు కూడా బాగానే పెరిగాయి. దీప్కే గతంలో సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు అతడికి ఆప్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. సీజేపీ ఫాలోవర్లు అంతా బంగ్లాదేశ్, పాకిస్తాన్‌కు చెందిన వారే అనే వాదన కూడా వినిపిస్తోంది.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!