Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..

  • ఇది ట్రైలర్ మాత్రమే, అసలు ఉద్యమం ముందుంది..
  • కేంద్రానికి కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ హెచ్చరిక..
  • 7 రోజుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అల్టిమేటం..
Cjp

Cjp

Cockroach Janta Party: సోషల్ మీడియా సెన్సేషన్ ‘‘కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)’’ శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో మద్దతుదారులు పాల్గొన్నారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే, శనివారం నిర్వహించిన కార్యక్రమం కేవలం ‘‘ట్రైలర్ మాత్రమే’’ అని, అసలు ఉద్యమం ఇంకా ముందుందని సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే సోషల్ మీడియాలో హెచ్చరించారు.

నిన్న వేలాది మంది కార్యక్రమంలో పాల్గొని చరిత్ర సృష్టించారని, జంతర్ మంతర్‌లో శాంతియుత నిరసన ద్వారా ఐక్యంగా ఉంటే బొద్దింకలు ఏం చేయగలవో ప్రభుత్వానికి ట్రైలర్ చూపించాము అని అన్నారు. నిరసనలో పాల్గొన్న వారికి థాంక్స్ చెప్పారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారిలో చాలా మంది తొలిసారి నిరసనల్లో పాల్గొన్నారని చెప్పారు.

×
×
Ad

విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన అభిజిత్, ఇప్పుడు ప్రభుత్వం లేదా మంత్రి స్పందించడానికి 7 రోజులు అల్టిమేటం విధించారు. ధర్మేంద్ర ప్రధాన్ ఒక జనరేషన్ విద్యార్థులకు అన్యాయం చేశారని, ఏడు రోజుల్లో ఆయన పదవికి రాజీనామా చేయడం లేదా తొలగించబడటం చేయకపోతే తాము మరింత పెద్ద స్థాయిలో భౌతిక ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.