Site icon NTV Telugu

Yogi Adityanath: సినిమా ఇండస్ట్రీ అంటే యూపీనే గుర్తుకురావాలి

Cm Yogi Adiyanath

Cm Yogi Adiyanath

Yogi Adiyanath: యూపీలోని లక్నోలో వచ్చే నెలలో పెట్టుబడిదారుల సదస్సు జరగనుంది. ఈ సదస్సును ప్రోత్సహించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ గురువారం నాడు లక్నోకు వచ్చారు. ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్ సభ్యులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే యూపీనే గుర్తుకురావాలని సీఎం యోగి వ్యాఖ్యానించారు. యూపీలో వెబ్ సిరీస్ తీస్తే 50 శాతం, ఫిల్మ్ ల్యాబ్‌లు, స్టూడియోలు స్థాపిస్తే 25 శాతం సబ్సిడీ ఇస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. సమాజాన్ని ఏకం చేయడంలో, దేశ ఐక్యత, సార్వభౌమత్వాన్ని కాపాడటంలో సినిమా కీలక పాత్ర పోషిస్తుందని యోగి అన్నారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టితో పాటు రవి కిషన్, జాకీ భగ్నాని, జాకీ ష్రాఫ్, రాజ్‌పాల్ యాదవ్, సోనూ నిగమ్‌ల, బోనీ కపూర్, సుభాష్ ఘయ్ సహా ఇతర ప్రముఖులు సీఎం యోగితో సమావేశానికి హాజరయ్యారు.

Read Also: Dhamaka: మొత్తానికి రవన్న సెంచరీ కొట్టేసాడు రోయ్…

అటు 99 శాతం మంది డ్రగ్స్ తీసుకోరని, ప్రజలకు చేరువ కావడానికి కష్టపడి పనిచేయడంపై దృష్టి సారిస్తారని సీనియర్ నటుడు సునీల్ శెట్టి అన్నారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న బాయ్ కాట్ బాలీవుడ్ అనే హ్యాష్ ట్యాగ్‌ను తొలగించి బాలీవుడ్ పరిశ్రమను తిరిగి గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ఆయన యూపీ యోగి ఆదిత్యనాథ్ సాయం కోరారు. బుట్టలో కుళ్ళిన ఆపిల్ ఉండవచ్చు.. కానీ మనమందరం అలా కాదన్నారు. మన కథలు, మన సంగీతం ప్రపంచానికి కనెక్ట్ అవుతాయని.. కాబట్టి కళంకం తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. దయచేసి ఈ సందేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి కూడా తెలియజేయాలని సీఎం యోగిని సునీల్ శెట్టి కోరారు.

Exit mobile version