CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు.. సీఎం విజయ్ వైఖరిపై మిత్రపక్షాల్లో ఆగ్రహం..

  • ఓఎస్డీగా జ్యోతిష్యుడు రాధన్ పండిత్ నియామకం..
  • తమిళనాడులో సంచలనంగా మారిన సీఎం విజయ్ నిర్ణయం..
  • ప్రతిపక్షాల ఆగ్రహం, నియామకంపై అభ్యంతరం..
Tvkvijay

Tvkvijay

CM Vijay: తమిళనాడులో మరో వివాదం రాజుకుంది. జ్యోతిష్యుడు, విజయ్ వ్యక్తిగత సలహాదారుడు రాధన్ పండిత్ వెట్రివేల్‌కు ప్రభుత్వం కీలక పోస్టును తమిళనాడు ప్రభుత్వం కేటాయించింది. రాధన్‌ను ‘ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ’ (OSD)గా నియమించడంతో ఈ వివాదం మొదలైంది. విజయ్ ఎన్నికల్లో విజయం సాధిస్తారని అంచనా వేసి వార్తల్లో నిలిచిన రాధన్, టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన తర్వాత మొదటగా విజయ్ ఇంటికి వెళ్లి అభినందనలు తెలియజేశారు. ఎన్నికల ప్రచార సమయంలో ఆయన విజయ్‌కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారు.

Read Also: Vijay: తమిళ సినీ అభిమానులకు సీఎం విజయ్ అదిరిపోయే గుడ్ న్యూస్

అయితే, ఈ నియామకం టీవీకే మిత్రపక్షాల్లో ఆగ్రహానికి కారణమైంది. మూఢనమ్మకాలను, జ్యోతిష్యుల్ని తీవ్రంగా వ్యతిరేకించే టీవీకే మిత్రపక్షాలు, డీఎంకే ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ శశికాంత్ సెంథిల్ మాట్లాడుతూ.. ‘‘ నాకైతే అర్థం కావడం లేదు. ఒక జ్యోతిష్యుడికి ఓఎస్డీ పదవి.?’’ అని ప్రశ్నించారు. ‘‘ లౌకిక ప్రభుత్వం ఇది ఆమోదయోగ్యం కాదు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు దీనిని పున:పరిశీలించాలి.’’ అని వీసీకే ప్రధాన కార్యదర్శి డి. రవికుమార్ ఎక్స్ పోస్టులో అన్నారు. ‘‘శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం ప్రభుత్వ కర్తవ్యం, సీఎం రాజకీయ విభాగం కార్యదర్శి ఈ రోజు ప్రకటించిన రాధన్ పండిత్ ఒక జ్యోతిష్యుడు. ఈ నియామకం ఆమోదయోగ్యంకాదు’’ అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు షణ్ముగం పి ఒక పోస్టులో విమర్శించారు.