Siddaramaiah: కర్ణాటకలో ముడా స్కాం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కుంభకోణం సమగ్ర విచారణలో భాగంగా సిద్ధూను ఎంక్వైరీ చేసేందుకు రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ పర్మిషన్ ఇవ్వడం చట్టబద్ధమేనని ఇటీవలే హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత కర్ణాటక లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు ప్రత్యేక న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చింది. ఈ పరిణామాతో ఆయన రాజీనామా చేయాలని బీజేపీ- జేడీఎస్ డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై స్పందించాలని ముఖ్యమంత్రిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించాగా.. సహనం కోల్పోయిన ఆయన, మైక్‌లను పక్కకు తోసేసి.. అవసరమైతే నేనే పిలిచి మాట్లాడుతాగా అంటూ సీరియస్ అయ్యారు.
Read Also: Revanth Reddy Photo: ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫోటో పెట్టండి.. అధికారులకు సర్కార్ ఆదేశం
ఇక, ‘ముడా’ స్థలాల కేటాయింపుల్లో సీఎం సిద్ధరామయ్య కుటుంబ సభ్యులు లబ్ధి పొందటంతో ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేశారని సామాజిక కార్యకర్త టీజే అబ్రహం గవర్నర్‌కు కంప్లైంట్ చేశారు. ఆయనతో పాటు స్నేహమయి కృష్ణ, ప్రదీప్‌కుమార్ సీఎంపై ఫిర్యాదు చేయగా.. వీరి కంప్లైంట్స్ మేరకు ఆగస్టు 16వ తేదీన కర్ణాటన ముఖ్యమంత్రిని విచారించాలంటూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఈ ఆదేశాలను రద్దు చేయాలని కన్నడ మంత్రివర్గం తీర్మానం చేసినప్పటికి.. దానిని గవర్నర్ తోసిపుచ్చారు. దాంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. కాగా, ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేసి, విచారణను ఎదుర్కోవాలన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర డిమాండ్ చేశారు. ఆయన ఎంత మొండిగా వ్యవహరించినా, ముఖ్యమంత్రి పీఠాన్ని వీడవలసిందేనని వ్యాఖ్యానించారు. మరోవైపు తాను విచారణకు భయపడటం లేదని సిద్ధరామయ్య తేల్చి చెప్పారు.