CJP: నీట్ పేపర్ లీక్ వివాదంలో యువత పెద్ద ఎత్తున ఉద్యమించింది. ఈ ఉద్యమానికి కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ముందు నిలిచింది. ఢిల్లీ జంతర్ మంతర్ నిరసనల కారణంగా కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. బీజేపీని టార్గెట్ చేసిన సీజేపీ, పేపర్ లీక్‌లు జరిగిన పంజాబ్, జార్ఖండ్, కర్ణాటక విషయంలో మౌనంగా ఎందుకు ఉంటుంది అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధికారంలో ఉన్న పంజాబ్, జేఎంఎం+కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉన్న జార్ఖండ్, కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన పేపర్ లీకులపై కనీసం సీజేపీ మాట కూడా మాట్లాడటం లేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లు ఆ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు కూడా రాజీనామా ఇవ్వాలని సీజేపీ ఎందుకు అడగటం లేదని ప్రశ్నిస్తున్నారు.
పంజాబ్ సర్కార్‌పై తీవ్ర ఆరోపణలు:
సీజేపీ ఉద్యమానికి ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మద్దతుగా నిలిచారు. పలువురు ఆప్ నేతలు జంతర్ మంతర్ వద్దకు వెళ్లి నిరసనల్లో పాల్గొన్నారు. కానీ సొంత రాష్ట్రంలో లీకులపై నోరు మెదపడం లేదు. సీజేపీ కూడా ఆప్‌ను ప్రశ్నించే సాహసం చేయడం లేదు. గత ఐదేళ్లలో ఆరు ప్రధాన ప్రశ్నపత్రాల లీకులు జరిగాయని బీజేపీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ ఇటీవల ఆరోపించారు. అలాగే, జూలై 19న జరిగిన ఫార్మసీ అధికారుల పరీక్షలో భారీ స్థాయిలో మోసాలు జరిగినట్లు గుర్తించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ లీకులపై కేజ్రీవాల్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని అడిగారు. కేజ్రీవాల్ అనుచరులే సీజేపీని సృష్టించి, డబ్బులిచ్చి చేయించిన సోషల్ మీడియా ప్రచారాల వల్లే ఉద్యమం పెద్దగా మారిందని ఆరోపించారు.
జార్ఖండ్, కర్ణాటకల పేపర్ లీకులపై కూడా ఇదే మౌనం:
జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలలో జరిగిన అవకతవకల జరిగినట్లు ఆరోపణలతు ఉన్నాయి. జేపీఎస్సీ మాజీ డిప్యూటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్, పరీక్షల ప్రక్రియను నిర్వహించిన ప్రైవేట్ ఏజెన్సీ సిబ్బందితో సహా కనీసం ఎనిమిది మందిని సీఐడీ అరెస్టు చేసింది. దాడులు నిర్వహించి, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు, దర్యాప్తు కొనసాగుతోంది.
కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఎగ్జామ్ కూడా లీక్ అయిందని అక్కడి యువత ఆందోళన చేస్తోంది. నీట్ వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరిన కాంగ్రెస్, సొంత రాష్ట్రంలో మాత్రం విద్యామంత్రిపై చర్యలు తీసుకోలేదు.
సీజేపీ సైలెంట్..
బీజేపీ విషయంలో ఉద్యమాన్ని తీవ్రం చేసిన కాక్రోచ్ జనతా పార్టీ, ఇతర రాష్ట్రాల విద్యార్థి సమస్యలపై మాత్రం మౌనంగా ఉంటోంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత పంజాబ్ పేపర్ లీక్‌లపై ప్రశ్నించిన నేపథ్యంలో, సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రాంకా, సౌరభ్ దాస్‌లు ఏమి చెప్పకుండా అక్కడి నుంచి జారుకున్న వీడియోలు వైరల్ అయ్యాయి. కేవలం, వాటిపై కూడా స్పందిస్తాము, ప్లాన్ సిద్ధం చేస్తున్నామని అభిజిత్ దీప్కే చెప్పడం తప్పితే ఎలాంటి డిమాండ్ రావడం లేదు. దీంతో నెటిజన్లు, సాధారణ ప్రజలు సీజేపీ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తు్న్నారు. జవాబుదారీతనం అంటూ సీజేపీ గొంతు చించుకుంది, కానీ ఇదే జవాబుదారీతనాన్ని ఆప్, జేఎంఎం, కాంగ్రెస్ నుంచి ఎందుకు కోరడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

