CJP Parliament March: ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్.. పార్లమెంట్ వరకు దూసుకెళ్లిన CJP కార్యకర్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP Parliament March: ఢిల్లీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజే రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీట్ పేపర్ లీక్, పోటీ పరీక్షల్లో అక్రమాలు, పెరుగుతున్న నిరుద్యోగం వంటి అంశాలపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ‘సంసద్ ఛలో’ ఉద్యమం ఉధృతమైంది. వేలాది మంది విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు ర్యాలీగా కదలడంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నిరసనకారులు రైల్ భవన్, విజయ్ చౌక్ ప్రాంతాలకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారిని పార్లమెంట్ వైపు వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అల్లర్ల నిరోధక దళాలు, సీఆర్పీఎఫ్, పారామిలిటరీ బలగాలు దాదాపు గంటన్నర పాటు నిరసనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో పార్లమెంట్ దక్షిణ ద్వారంతో పాటు రెండు ప్రధాన ప్రవేశ మార్గాలను భద్రతా కారణాల దృష్ట్యా తాత్కాలికంగా మూసివేశారు.
పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. పార్లమెంట్ వరకు దూసుకెళ్లారు నిరసనకారులు.. పార్లమెంట్‌కు అత్యంత సమీపం వరకు నిరసనకారులు చేరుకోవడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. మెట్రో స్టేషన్ల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ పరిసర ప్రాంతాలను దుర్భేద్యమైన భద్రతా వలయంలో ఉంచగా, పరిస్థితిపై అధికారులు ఎప్పటికప్పుడు నిఘా కొనసాగిస్తున్నారు..
Also Read
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
CJP డిమాండ్లు..
CJP ప్రధానంగా మూడు డిమాండ్లతో ఉద్యమాన్ని కొనసాగిస్తోంది. NEET సహా పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకులపై నిష్పక్షపాత విచారణ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, అలాగే నిరుద్యోగం, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో జాప్యంపై చర్యలు తీసుకోవాలని పార్టీ డిమాండ్ చేస్తోంది.
ఇదే సమయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. CJP నిరసనల నేపథ్యంలో ఈ భేటీ జరిగినట్లు సమాచారం. అయితే సమావేశంలో జరిగిన చర్చలపై అధికారిక వివరాలు వెలువడలేదు. మరోవైపు, ప్రభుత్వం తమతో చర్చలకు ముందుకొచ్చిందని CJP ప్రకటించింది. పార్టీ ప్రతినిధులు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సమావేశం ఉంటుందని వెల్లడించారు. అయితే ఈ ప్రకటనను జేపీ నడ్డా ఖండించారు. “CJPతో ఎలాంటి చర్చలు జరగవు. అలాంటి సమావేశానికి ప్రభుత్వం అంగీకరించలేదు” అని స్పష్టం చేశారు. దీంతో చర్చల అంశంపై గందరగోళం నెలకొంది.
అయితే, జంతర్ మంతర్ వద్ద గత రెండు రోజులుగా కొనసాగుతున్న నిరాహార దీక్షను CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే విరమించారు. పార్టీ ప్రతినిధుల ప్రకారం, చర్చల సంకేతాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే ప్రభుత్వం నుంచి అధికారిక ధృవీకరణ రాకపోవడంతో పరిస్థితి ఇంకా స్పష్టతకు రాలేదు. పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా ఢిల్లీ పోలీసులు రాజధానిలో మూడు అంచెల భద్రతా వ్యవస్థను అమలు చేశారు. జంతర్ మంతర్, పార్లమెంట్ స్ట్రీట్, సెంట్రల్ విస్టా, కన్నాట్ ప్లేస్, శంకర్ చౌక్ ప్రాంతాల్లో భారీగా పోలీసులు, పారామిలిటరీ బలగాలను మోహరించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక స్పందన బృందాలను కూడా సిద్ధంగా ఉంచారు.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!