NTV Telugu Site icon

Karnataka: పాలస్తీనా జెండాలతో హల్‌చల్.. నలుగురు మైనర్లు అరెస్ట్

Karnataka

Karnataka

కర్ణాటకలో నలుగురు మైనర్లు పాలస్తీనా జెండాలతో హల్‌చల్ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: Jani Master: జానీ మాస్టర్ వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ కీలక ప్రకటన

చిక్కమగళూరు జిల్లాలో ద్విచక్ర వాహనాలపై వెళ్తూ నలుగురు మైనర్లు పాలస్తీనా జెండాను ఎగురవేశారు. వీడియో సోషల్ మీడియాలో రావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. నలుగురు మైనర్లను కర్ణాటక పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మైనర్‌లకు జెండా ఎలా లభించింది? వారు స్వయంగా చేశారా లేదా ఎవరైనా అలా చేయమని ఆదేశించారా అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై బీజేపీ ఆందోళన చేపట్టింది. దీనిపై ఎన్‌ఐఏ దర్యాప్త చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రతిపక్ష నేత, బీజేపీ సీనియర్ నేత ఆర్.అశోక కోరారు.

ఇది కూడా చదవండి: Nipah Virus: స్కూళ్లు బంద్, మాస్కులు తప్పనిసరి..”నిపా వైరస్” గుప్పిట మలప్పురం..

ఇక ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఇన్‌స్పెక్టర్‌ నేతృత్వంలో పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసు శాఖ సమగ్ర విచారణ జరుపుతోంది. ఈద్ మిలాద్ పండుగ ఊరేగింపు చిక్కమగళూరు నగరంలోని ప్రధాన రహదారుల గుండా వెళుతుండగా పోలీసులు అప్రమత్తమయ్యారు. చిక్కమగళూరు సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ సంఘటన ఆదివారం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Kolkata: సీఎం మమతతో చర్చలకు జూడాలు అంగీకారం