Jani Master: జానీ మాస్టర్ వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ కీలక ప్రకటన
- కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ మీద పోలీసులకు ఫిర్యాదు
- తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు
- అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jani Master: కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నట్లు మరో మహిళా కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్‌డోర్ షూట్ చేస్తున్నప్పుడు, నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి తదుపరి విచారణ కోసం సదరు మహిళ నార్సింగి నివాసి అయినందున నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేశారు.
Also Read: Demonte Colony 2: భయపెట్టడానికి మీ ఇంటికే ‘డీమాంటే కాలనీ 2’.. జాగ్రత్త!
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
అతనిపై ఐపీసీ సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506) మరియు స్వచ్ఛందంగా గాయపరచడం (323)లోని క్లాజ్ (2) మరియు (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ లో సభ్యులైన కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల ఫిర్యాదును తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ కి ఇవ్వడం జరిగిందని, దానిని తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ కు సిఫార్సు చేయడం జరిగిందనీ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అంతర్గత ఫిర్యాదు కమిటీ సమావేశం అయ్యి POSH చట్టం 2013 మార్గదర్శకాల ప్రకారం విచారణ చేస్తారని, భాదిత పక్షం పోలీస్ డిపార్ట్మెంట్ లో ఫిర్యాదు చేసి FIR నమోదు చేసారని మాకు తెలిసిందని అన్నారు.
Also Read: Jani Master : పరారీలో జానీ మాస్టర్.. బాధిత మహిళ కూడా? ఏ క్షణమైనా అరెస్ట్??
భాదిత పార్టీల గోప్యతను కాపాడాలని మేము అన్ని మీడియా సంస్థలను, ప్రింట్ మీడియా/ డిజిటల్ మీడియా/ ఎలక్ట్రానిక్ మీడియాలను అభ్యర్ధిస్తున్నాము, సుప్రీం కోర్ట్ మార్గదర్శకాల ప్రకారం ఈ సమస్య పరిష్కరించబడే వరకు సంబంధిత వ్యక్తుల యొక్క బ్లర్ చేయని ఫొటోగ్రాఫ్ లను, వీడియోలను ఉపయోగించవద్దు అని కోరారు. ఏదైనా ఉపయోగించినట్లైతే వాటిని వెంటనే తీసివేయమని మీ అందరిని మరొకసారి అభ్యర్ధిస్తున్నాము అంటూ ఛాంబర్ కార్యదర్శి కె.ఎల్. దామోదర్ ప్రసాద్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..