Site icon NTV Telugu

Rajnath Singh: రక్షణ మంత్రితో సీడీఎస్ అనిల్ చౌహాన్ భేటీ.. నార్త్ బ్లాక్‌కు బీఎస్ఎఫ్ చీఫ్..

Anil Chauhan

Anil Chauhan

Rajnath Singh: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్‌ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే దౌత్యపరమైన దాడిని ప్రారంభించింది. ఇక మిలిటరీ యాక్షన్ ఏదైనా ఉంటుందా..? అనే దానిపై దేశ ప్రజలు మాట్లాడుతుకుంటున్నారు. తాజాగా, ఆదివారం, త్రివిధ దళాల చీఫ్, చీఫ్ అఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) అనిల్ చౌహాన్, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని ఆయన నివాసంలో కలిశారు. వీరిద్దరు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also: Vajra Super Shot: ఐపీఎల్లో మరింత భద్రత పెంపు.. రంగంలోకి “వజ్ర సూపర్ షాట్”

ఇద్దరి మధ్య సమావేశం 40 నిమిషాల పాటు కొనసాగింది. మరోవైపు, బీఎస్ఎఫ్ డీజీ దల్జిత్ సింగ్ చౌదరి హోం మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుత పరిస్థితి గురించి రాజ్‌నాథ్ సింగ్‌కు సీడీఎస్ వివరణాత్మక సమాచారం ఇచ్చారు. ఇద్దరి మధ్య జరిగిన సమావేశంలో త్రివిధ దళాలు, నౌకాదళం, వైమానిక దళాల సంసిద్ధతపై చర్చించినట్లు తెలుస్తోంది. సరిహద్దు భద్రతా దళం (BSF) డైరెక్టర్ జనరల్ దల్జిత్ సింగ్ చౌదరి ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో ఉన్న హోం మంత్రిత్వ శాఖకు కార్యాలయానికి వెళ్లారు. సరిహద్దుల భద్రతపై అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఈ భేటీ తర్వాత, ఏదైనా మిలిటరీ యాక్షన్ ఉంటుందా.? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే, భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసుకోవడంతో పాకిస్తాన్ భయపడుతోంది. మరోవైపు, భారత్ నేవీ అరేబియా సముద్రంలో యుద్ధ విన్యాసాలు, క్షిపణి పరీక్షలు చేపట్టడం పాక్ వెన్నులో వణుకు పట్టిస్తోంది. బయటకు పాక్ మంత్రులు అణ్వాయుధాలు ఉన్నాయని ఎన్ని వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ లోలోపల మాత్రం భయం అలాగే ఉంది.

Exit mobile version