Rajnath Singh: రక్షణ మంత్రితో సీడీఎస్ అనిల్ చౌహాన్ భేటీ.. నార్త్ బ్లాక్‌కు బీఎస్ఎఫ్ చీఫ్..
- రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లో సీడీఎస్ అనిల్ చౌహాన్ భేటీ..
- భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్‌ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే దౌత్యపరమైన దాడిని ప్రారంభించింది. ఇక మిలిటరీ యాక్షన్ ఏదైనా ఉంటుందా..? అనే దానిపై దేశ ప్రజలు మాట్లాడుతుకుంటున్నారు. తాజాగా, ఆదివారం, త్రివిధ దళాల చీఫ్, చీఫ్ అఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) అనిల్ చౌహాన్, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని ఆయన నివాసంలో కలిశారు. వీరిద్దరు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also: Vajra Super Shot: ఐపీఎల్లో మరింత భద్రత పెంపు.. రంగంలోకి “వజ్ర సూపర్ షాట్”
Also Read
- Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
ఇద్దరి మధ్య సమావేశం 40 నిమిషాల పాటు కొనసాగింది. మరోవైపు, బీఎస్ఎఫ్ డీజీ దల్జిత్ సింగ్ చౌదరి హోం మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుత పరిస్థితి గురించి రాజ్‌నాథ్ సింగ్‌కు సీడీఎస్ వివరణాత్మక సమాచారం ఇచ్చారు. ఇద్దరి మధ్య జరిగిన సమావేశంలో త్రివిధ దళాలు, నౌకాదళం, వైమానిక దళాల సంసిద్ధతపై చర్చించినట్లు తెలుస్తోంది. సరిహద్దు భద్రతా దళం (BSF) డైరెక్టర్ జనరల్ దల్జిత్ సింగ్ చౌదరి ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో ఉన్న హోం మంత్రిత్వ శాఖకు కార్యాలయానికి వెళ్లారు. సరిహద్దుల భద్రతపై అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఈ భేటీ తర్వాత, ఏదైనా మిలిటరీ యాక్షన్ ఉంటుందా.? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే, భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసుకోవడంతో పాకిస్తాన్ భయపడుతోంది. మరోవైపు, భారత్ నేవీ అరేబియా సముద్రంలో యుద్ధ విన్యాసాలు, క్షిపణి పరీక్షలు చేపట్టడం పాక్ వెన్నులో వణుకు పట్టిస్తోంది. బయటకు పాక్ మంత్రులు అణ్వాయుధాలు ఉన్నాయని ఎన్ని వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ లోలోపల మాత్రం భయం అలాగే ఉంది.
#WATCH | Delhi | Chief of General Staff (CDS) General Anil Chauhan arrives at the residence of Raksha Mantri Rajnath Singh. pic.twitter.com/7nv9SpZzIC
— ANI (@ANI) April 27, 2025
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!