మావోయిస్టు పార్టీ టాప్ లీడర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే మృతిపై ఉద్యమనేతలంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.. ఆయన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అటవీ ప్రాంతంలో కన్నుమూశారు.. ఇప్పటికే ఆర్కే అనారోగ్య సమస్యలపై మృతిచెందినట్టు ఆ రాష్ట్ర డీజీపీ వెల్లడించగా.. తాజాగా.. ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. బస్తర్ అటవీ ప్రాంతంలో ఆర్కే మరణించినట్లు సమాచారం అందిందని.. ఆ ప్రకటలో తెలిపారు ఐజీ సుందర్‌రాజ్.. అనారోగ్యంతోనే ఆర్కే మృతిచెందినట్లు సెంట్రల్ కమిటీ కూడా నిర్ధారించినట్లు ఆయన వెల్లడించారు.
also read: గెలిచే టీం ను అంచనా వేయండి 50 లక్షలు గెలవండి
ఆర్కే మృతితో అప్రమత్తం అయినట్టు ప్రకటనలో పేర్కొన్నారు ఐజీ సుందర్‌రాజ్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ సప్లయర్స్‌పై నిఘా పెట్టినట్లు చెప్పారు. గత రెండేళ్లలో రామన్న, హరిభూషణ్, ఆర్కే సహా పలువురికి మందులు అందించారని, ఈ ఘటనలపై స్థానికులు తమకు సమాచారం ఇవ్వలేదంటున్నారు పోలీసులు.. బస్తర్‌లో శాంతి నెలకొనేలా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు ఆ ప్రాంత ఐజీ.. కాగా, అనారోగ్యం బారినపడిన ఆర్కేకు వైద్యం అందలేదని.. వైద్యం అందితే ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడేవారని అంటున్నారు ఆయన బంధువులు.