Site icon NTV Telugu

Chhattisgarh: ప్రియురాలిపై అనుమానం.. కిరాతంగా కొట్టి చంపిన లవర్..

Girlfriend Murder

Girlfriend Murder

Chhattisgarh Man Beats 25-Year-Old Girlfriend To Death: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం జరిగింది. అనుమానంతో ప్రేమించిన ప్రియురాలిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్‌తరి జిల్లాలో జరిగింది. ప్రియుడు, 25 ఏళ్ల ప్రియురాలిపై దాడి చేసి చేశాడని పోలీసులు వెల్లడించారు. జిల్లాలోని మగర్ లోడ్ పట్టణంలో బాధితురాలు టీ స్టాల్ నిర్వహిస్తోంది. సోమవారం సాయంత్రం టీ స్టాల్ లోనే ప్రియుడు, ప్రియురాలిపై కర్రతో దాడి చేసి అక్కడ నుంచి పారిపోయాడు. తలకు తీవ్రగాయాల వల్ల రక్తస్రావంతో మహిళ చనిపోయింది. నిందితుడు మగర్‌లోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిసోరా గ్రామానికి చెందినవాడని ధామ్‌తరి ఎస్పీ ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు.

Read Also: Arunachal Pradesh Clash: భారత్-చైనా సరిహద్దు ఘర్షణలపై స్పందించిన అమెరికా..

బాధితురాలు రేషామి సాహు స్థానికంగా టీస్టాల్ నిర్వహిస్తోంది. నిందితుడు, సాహు గత నాలుగేళ్లుగా సంబంధంలో ఉన్నారు. అయితే ఇటీవల రేషామి సాహు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని నిందితుడు అనుమానించడం ప్రారంభించారు. ఈ విషయమై సోమవారం వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. ఈ క్రమంలోనే కోపంలో నిందితుడు, రేషామి సాహుపై కర్రతో తీవ్రంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలైన ఆమె రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. మహిళను స్థానికంగా ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Exit mobile version