Chhattisgarh: ప్రియురాలిపై అనుమానం.. కిరాతంగా కొట్టి చంపిన లవర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh Man Beats 25-Year-Old Girlfriend To Death: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం జరిగింది. అనుమానంతో ప్రేమించిన ప్రియురాలిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్‌తరి జిల్లాలో జరిగింది. ప్రియుడు, 25 ఏళ్ల ప్రియురాలిపై దాడి చేసి చేశాడని పోలీసులు వెల్లడించారు. జిల్లాలోని మగర్ లోడ్ పట్టణంలో బాధితురాలు టీ స్టాల్ నిర్వహిస్తోంది. సోమవారం సాయంత్రం టీ స్టాల్ లోనే ప్రియుడు, ప్రియురాలిపై కర్రతో దాడి చేసి అక్కడ నుంచి పారిపోయాడు. తలకు తీవ్రగాయాల వల్ల రక్తస్రావంతో మహిళ చనిపోయింది. నిందితుడు మగర్‌లోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిసోరా గ్రామానికి చెందినవాడని ధామ్‌తరి ఎస్పీ ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు.
Read Also: Arunachal Pradesh Clash: భారత్-చైనా సరిహద్దు ఘర్షణలపై స్పందించిన అమెరికా..
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
బాధితురాలు రేషామి సాహు స్థానికంగా టీస్టాల్ నిర్వహిస్తోంది. నిందితుడు, సాహు గత నాలుగేళ్లుగా సంబంధంలో ఉన్నారు. అయితే ఇటీవల రేషామి సాహు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని నిందితుడు అనుమానించడం ప్రారంభించారు. ఈ విషయమై సోమవారం వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. ఈ క్రమంలోనే కోపంలో నిందితుడు, రేషామి సాహుపై కర్రతో తీవ్రంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలైన ఆమె రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. మహిళను స్థానికంగా ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!