Chhattisgarh Congress: ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ఆఫీస్‌లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై ‘లవ్ యూ’ నోట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh Congress: ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో ఒక వింతైన, విస్తుపోయే దొంగతనం వెలుగుచూసింది. గాంధీ చౌక్ ప్రాంతంలోని విఐపి జోన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ‘రాజీవ్ భవన్’ లోకి గుర్తు తెలియని దొంగలు చొరబడిన .. అక్కడ చేసిన పని ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఏం జరిగిందంటే..
72 నల్లాలు మాయం.. నేలపై ‘లవ్ యూ’ నోట్!
ఆఫీస్ బాత్రూమ్లలోని ఖరీదైన నల్లాలను ఎత్తుకెళ్లడమే కాకుండా, వెళ్తూ వెళ్తూ అక్కడ దొంగలు వదిలివెళ్లిన ఒక లేఖ పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ ఘటన స్థానిక శాంతిభద్రతలపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది. కాంగ్రెస్ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజీవ్ భవన్ బాత్రూమ్లలో ఉన్న దాదాపు 72 ఖరీదైన వాటర్ ట్యాప్‌లను (నల్లాలను) దొంగలు చాలా చాకచక్యంగా విరగ్గొట్టకుండా ఊడదీసుకుని వెళ్లారు. దొంగతనం చేసిన తర్వాత, ఏమాత్రం భయం లేకుండా ఆఫీస్ నేలపై “లవ్ యూ” (Love You) అని రాసి మరీ పారిపోయారు. వారు ఎంత పక్కా ప్లానింగ్‌తో, నింపాదిగా ఈ పని చేశారంటే.. వారికి పోలీసులన్నా, దొరికిపోతామన్నా అస్సలు భయం లేనట్లు స్పష్టమవుతోంది.
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
మూడోసారి టార్గెట్..
ఈ దొంగతనం గురించి సమాచారం అందుకున్న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ పాఠక్ వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నగరం నడిబొడ్డున, విఐపి జోన్‌గా పరిగణించే ఏరియాలోనే ఇలాంటి దొంగతనం జరగడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్ భవన్లో దొంగతనం జరగడం ఇది మొదటిసారి కాదు, ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం. నగరంలో యాక్టివ్‌గా ఉన్న డ్రగ్స్ బానిసలు, అసాంఘిక శక్తులే ఈ పని చేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దొంగతనం చేసి నేలపై ‘లవ్ యూ’ అని సందేశం రాయడం.. నేరుగా ఇక్కడి పోలీస్ యంత్రాంగాన్ని, పరిపాలనను వెక్కిరించడమేనని బాలకృష్ణ పాఠక్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నగరం నడిబొడ్డున ఉన్న ఒక రాజకీయ పార్టీ ఆఫీసులోనే భద్రత లేకపోతే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? దొంగల ధైర్యం చూస్తుంటే ఇక్కడ శాంతిభద్రతలు ఎంతలా క్షీణించాయో అర్థమవుతోంది” అని అన్నారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!