దేశంలో వేగంగా వ్యాక్సినేషన్ అందిస్తున్నారు. ముఖ్యంగా మెట్రోపాలిటన్ నగరాల్లో వ్యాక్సిన్ వేగవంతం చేస్తున్నారు. నగరాల్లోని ప్రజలకు వీలైనంత వేగంగా వ్యాక్సినేషన్‌ను కంప్లీట్ చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. వ్యాక్సినేషన్ విషయంలో ముంబై, ఢిల్లీలను వెనక్కినెట్టి చెన్నై దూసుకుపోతున్నది. చెన్నై ప్రజల్లో వ్యాక్సిన్ ఎడల అవగాహన రావడంతో వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు.
Read: అసభ్య సంభాషణలతో మూడేళ్లలోనే 75 కోట్ల సంపాదన…
వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రయ కొనసాగుతుంది. కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్‌లు ఏవి ఉంటే వాటిని తీసుకోవడానికి ఆసక్తిచూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆద్వర్యంలో రన్ చేస్తున్న కోవిన్ యాప్ ప్రకారం ఇప్పటి వరకు చెన్నైలో 24.4 శాతం మంది కరోనా మొదటి టీకా తీసుకున్నారు. 7.5 శాతం మంది రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇక 18 ఏళ్లు నిండిన వారి విషయానికి వస్తే, 31.1 శాతం మంది మొదటి డోస్‌ను తీసుకోగా, 10.8 శాతం మంది సెకండ్ డోస్‌ను తీసుకున్నట్టు గణాంకాలు చెబుతున్నయి.