Site icon NTV Telugu

Chemistry Teacher: విద్యార్థినికి కడుపు చేసిన కెమిస్ట్రీ ఉపాధ్యాయుడు..

Chennai

Chennai

Chemistry Teacher: తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లా సేతియాతోపు పక్కన ఉన్న మంగళం ప్రాంతానికి చెందిన మలర్‌ సెల్వం.. అదే ఏరియాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కెమిస్ట్రీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో పాఠశాలలో ప్లస్‌–2 చదువుతున్న విద్యార్థిని లైంగికంగా వేధించేవాడని సమాచారం. ఈ స్టూడెంట్ ప్రస్తుతం చైన్నెలోని ఓ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతుంది.

Read Also: Gold and Silver Rates Today: పుత్తడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

అయితే, ఈ నెల 15వ తేదీన కడుపునొప్పి రావడంతో చికిత్స కోసం చైన్నెలోని కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి సదరు విద్యార్థిని వెళ్లింది. అప్పుడు ఆమెకి మగ పిల్లాడు పుట్టాడు. దీంతో విద్యార్థిని విషం తాగి సూసైడ్ చేసుకోవడానికి యత్నించింది. ఇది చూసిన హస్పటల్ సిబ్బంది ఆమెను రక్షించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఇక, ఆ స్టూడెంట్ బంధువులు సెంబియం తోప్పు ఆల్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌లో కెమిస్ట్రీ టీచర్ పై ఫిర్యాదు చేశారు. కాగా, రంగంలోకి దిగిన పోలీసులు ఉపాధ్యాయుడు మలర్‌ సెల్వంను గురువారం అరెస్టు చేసి విచారణ చేశారు. ప్రాక్టికల్స్‌లో మార్కులు తగ్గిస్తానని బెదిరించి గతేడాది స్కూల్‌లో విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పాడని తేలింది. అయితే, సదరు కీచక ఉపాధ్యాయుడికి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు.

Exit mobile version