Charlie Kirk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి మద్దతుదారు, సన్నిహతుడిగా పరిగణించే చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారు. ఉటా లోని యూనివర్సిటీ ప్రాంగణంలో వేలమంది ఆయన ప్రసంగాన్ని వినేందుకు గుమిగూడిన క్షణంలో ఆయనపై కాల్పులు జరిపారు. ట్రంప్ కిర్క్‌ను ‘‘అమెరికాకు అంకితమైన దేశభక్తుడు’’గా కొనియాడారు. ఆయన మరణం అమెరికాకు చీకటి క్షణంగా అభివర్ణించారు.
అయితే, మే నెలలో జరిగిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి ఆ సమయంలో కిర్ల్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత, నాలుగు రోజుల పాటు జరిగిన భారత్-పాక్ యుద్ధం గురించి కిర్ల్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ‘‘చంచలమైన దేశం’’గా అభివర్ణించారు. మరోవైపు భారతీయ వర్కర్ల వల్ల అమెరికన్లకు ఉద్యోగాలు దొరకడం లేదని అన్నారు.
Read Also: Seethakka: వాళ్లు కావాలనే సరఫరా చేయడం లేదు.. యూరియా పంపిణీపై మంత్రి సీతక్క ఫైర్…
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను చార్లీ కిర్క్ తన పాడ్‌కాస్ట్‌లో ప్రస్తావించారు. ఈ వివాదంలో అమెరికా ప్రమేయం ఉందనే వాదనను ఆయన తోసిపుచ్చారు. ప్రతీ సమస్య అమెరికా సమస్యనా?? అని ప్రశ్నించారు. యూట్యూబ్‌లో 4 మిలియన్ సబ్‌స్క్రైబర్లు ఉన్న కిర్క్, మే 8న ఈ అంశంపై ఒక వీడియో చేశారు. ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ.. ‘‘ పాకిస్తాన్ 100 శాతం ముస్లిం దేశం, వారు బిన్ లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చారు. భారతదేశంలో హిందువులు ఎక్కువ. వారు ఒకరినొకరు పెద్దగా ఇష్టపడరు’’ అని అన్నారు. కాశ్మీర్‌లో పర్యాటకులపై ముస్లిం ఉగ్రవాద దాడి జరిగింది, దీనికి పాకిస్తాన్‌తో సంబంధం ఉన్నట్లు అనిపిస్తోంది, కాబట్టి భారత్ కోపంగా ఉందని కిర్క్ అన్నారు. భారత్, పాకిస్తాన్ అణ్వాయుధ దేశాలైనప్పటికీ, ఈ సంఘర్షణ అణుయుద్ధానికి దారి తీయదని ఆయన చెప్పారు.
