Ayodhya: హనుమంతుడి జన్మస్థలం కర్ణాటక హంపీ ప్రాంతాంలో ఉన్న కిష్కింధ నుంచి శ్రీరాముడి కోసం ప్రత్యేక రథం అయోధ్యకు చేరుకుంది. జనవరి 22న రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందే అయోధ్యకు చేరింది. దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల మీదుగా రథం అయోధ్యకు చేరుకునే ముందు సీతా దేవీ జన్మస్థలమైన నేపాల్‌లోని జనక్‌పూర్ వెళ్లింది. 100 మంది భక్తుల బృందం "జై శ్రీ రామ్" నినాదాలు చేస్తూ రథం వెంట నడిచారు. మూడేళ్ల క్రితం ఈ యాత్ర ప్రారంభమైంది.