కరోనా మహమ్మారి కారణంగా నిలిపివేసిన చార్ధామ్ యాత్ర తిరిగి ప్రారంభం అవుతోంది.. ఇవాళ్టి నుంచి చార్ధామ్ యాత్రకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.. ఇదే సమయంలో.. కరోనా కేసులు ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోవడంతో నిబంధనలు కూడా విధించింది.. ముఖ్యంగా కోవిడ్ కేసులు అధికంగా వెలుగుచూస్తున్న.. కేరళ, ఏపీ.. లాంటి రాష్ట్రాలకు చెందినవారిపై ప్రత్యేక ఆంక్షలు పెట్టింది.. నైనిటాల్ హైకోర్టు నిషేధం ఎత్తివేసిన తర్వాత చార్ధామ్ యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం.. అయితే, కోవిడ్ నెగిటివ్ రిపోర్టుతోపాటు వ్యాక్సినేషన్‌కు సంబంధించి సర్టిఫికెట్ కూడా ఉంటేనే.. వారిని చార్ధామ్ యాత్రకు అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇక, ఈ యాత్రలోని దేవాలయాలను సందర్శించే భక్తుల సంఖ్యపై రోజువారీ పరిమితిని కూడా విధించిన హైకోర్టు.. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించాలని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులు స్మార్ట్ సిటీ పోర్టల్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.. దీంతో.. కోర్టు ఆదేశాలను అనుగుణంగా.. బద్రీనాథ్‌లో ప్రతిరోజూ 1,000 మంది, కేదార్‌నాథ్‌లో 800 మంది, గంగోత్రిలో 600 మంది, యమునోత్రిలో 400 మంది యాత్రికులను మాత్రమే అనుమతించాలని నిర్ణయం తీసుకుంది ఉత్తరాఖండ్ ప్రభుత్వం.