Ayodhya Ram Mandir Trust: నేటి అయోధ్య ట్రస్ట్ భేటీపై ఉత్కంఠ.. ఐదు ప్రధాన అజెండాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Ram Mandir Trust: అయోధ్యలోని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ రోజు నిర్వహించనున్న కీలక సమావేశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రామ మందిర కానుకల దొంగతనం ఆరోపణల నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో చంపత్ రాయ్ ట్రస్ట్‌లో కొనసాగుతారా? లేక తప్పుకుంటారా? అనే అంశం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న ఈ సమావేశాన్ని తొలుత మణిరామ్ కంటోన్మెంట్లో నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, అనంతరం రామ జన్మభూమి ప్రాంగణానికి వేదికను మార్చారు. ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల దాస్ తీవ్ర అనారోగ్యంతో ఉండగా, సీనియర్ ట్రస్టీ కె. పరాశరన్ ఆరోగ్య కారణాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది.
సమావేశంలో చర్చించే ఐదు కీలక అంశాలు
ఈ సమావేశంలో ప్రధానంగా ఐదు అంశాలపై చర్చించనున్నారు. అందులో చంపత్ రాయ్, అనిల్ మిశ్రాల రాజీనామాలపై నిర్ణయం అత్యంత కీలకంగా మారింది. అలాగే రామ మందిర కానుకల అపహరణ ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సమర్పించే ప్రాథమిక నివేదికను పరిశీలించనున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ నిర్వహణ చర్యలు, 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ-వ్యయ ఖాతాల సమీక్ష, ట్రస్ట్ పరిపాలనా వ్యవస్థలో చేపట్టాల్సిన మార్పులు కూడా అజెండాలో ఉన్నాయి.
Also Read
- Mumbai Heavy Rains: దంచికొట్టిన వాన.. 24 గంటల్లో 265 మిల్లీమీటర్ల వర్షం.. నేడు స్కూల్స్ కు సెలవు..!
- Colleges Closed: బిగ్‌షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
- PM Modi: ప్రధాని మోడీ ఇండోనేషియా పర్యటన.. బ్రహ్మోస్ ఒప్పందమే కీలకం..
- E20 protest: E20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా దేశంలో తొలిసారి నిరసన..
సీఈవో నియామకంపై కూడా చర్చ
ట్రస్ట్ పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కొత్త పరిపాలనా విధానంతో పాటు ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO) నియామకంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. అలాగే ప్రత్యేక ఆహ్వానిత సభ్యుడు గోపాల్ రావు పాత్రపైనా సభ్యులు అభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశముంది.
రామ మందిర ట్రస్ట్‌లో ప్రస్తుతం సభ్యులు వీరే
ప్రస్తుతం ట్రస్ట్‌లో నృత్య గోపాల దాస్, వాసుదేవానంద సరస్వతి, విశ్వప్రసన్నతీర్థ, పరమానంద గిరి, గోవింద్ దేవ్ గిరి, కృష్ణ మోహన్, దినేంద్ర దాస్, కె. పరాశరన్, చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలతో పాటు మొత్తం 11 మంది సాధారణ సభ్యులు ఉన్నారు. ట్రస్టీ విమ్లేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా మరణంతో ఉపాధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. కేంద్ర, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా పదవీరీత్యా ట్రస్ట్ సభ్యులుగా కొనసాగుతున్నారు.
కానుకల దొంగతనం కేసు దర్యాప్తు ఎక్కడిదాకా వచ్చింది?
రామ మందిర కానుకల దొంగతనం ఆరోపణలపై ప్రస్తుతం రెండు స్థాయిల్లో విచారణ కొనసాగుతోంది. ఒకవైపు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) పరిపాలనా విచారణ చేపడుతుండగా, మరోవైపు ట్రస్ట్ ఫిర్యాదు మేరకు పోలీసులు క్రిమినల్ దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, ప్రత్యేక ఆహ్వానిత సభ్యుడు గోపాల్ రావును అధికారులు విచారించినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు వీరిపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.
దేశవ్యాప్తంగా ఉత్కంఠ
రామ మందిర ఉద్యమం నుంచి ఆలయ నిర్మాణం వరకు కీలక పాత్ర పోషించిన చంపత్ రాయ్ భవితవ్యంపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ట్రస్ట్ భవిష్యత్ పరిపాలన, భక్తుల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేందుకు తీసుకునే నిర్ణయాలపైనా దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
Ayodhya Ram Mandir Trust: నేటి అయోధ్య ట్రస్ట్ భేటీపై ఉత్కంఠ.. ఐదు ప్రధాన అజెండాలు
-
Fire Accident: నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్ని ప్రమాదం
-
Lenin: ‘వస్తున్నాం… మనోడు కొడుతున్నాడు’.. అఖిల్ సినిమాపై నాగార్జున బ్లాక్‌బస్టర్ హుకుం!
-
Mumbai Heavy Rains: దంచికొట్టిన వాన.. 24 గంటల్లో 265 మిల్లీమీటర్ల వర్షం.. నేడు స్కూల్స్ కు సెలవు..!
-
Astrology: జూలై 6 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!