NTV Telugu Site icon

Lok sabha: నితీష్‌ సర్కార్‌కు కేంద్రం ఝలక్.. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన లేదని వెల్లడి

Bihar

Bihar

ఎన్డీఏ మిత్రపక్ష రాష్ట్రమైన బీహార్‌కు మోడీ ప్రభుత్వం గట్టి ఝలక్ ఇచ్చింది. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన లేదని కేంద్రం తాజాగా తేల్చిచెప్పింది. ఇటీవలే బీహార్‌లోని నితీష్‌ సర్కార్.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని తీర్మానం చేసింది. తాజాగా పార్లమెంట్‌లో జేడీయూ ఎంపీ రామ్‌ప్రీత్ మండల్ ఇదే అంశాన్ని లేవనెత్తారు. దీనికి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పందిస్తూ.. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన లేదని తేల్చిచెప్పారు.

ఇది కూడా చదవండి: Beerla Ilaiah: హరీష్ రావు.. ప్రభుత్వం మీద ఆరోపణలు మానుకో

సోమవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జేడీయూ ఎంపీ రామ్‌ప్రీత్ మండల్.. ఆర్థికంగాను, పారిశ్రామికంగాను బీహార్ సహా ఇతర వెనుక బడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉందా? లేదా? అని ఆర్థిక మంత్రిత్వ శాఖను అడిగారు. దీనికి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చిరు. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రణాళిక ఏదీ లేదని తేల్చిచెప్పారు.

ఇది కూడా చదవండి: Minister Nara Lokesh and BJP MLAs: మంత్రి నారా లోకేష్‌.. బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర చర్చ.. వారిచూపు బీజేపీ వైపు..!

బీహార్‌కు ప్రత్యేక హోదా కావాలన్నది జేడీయూ చిరకాల డిమాండ్. అయితే గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజార్టీ లభించలేదు. దీంతో బీహార్‌లోని నితీష్ పార్టీ అయిన జేడీయూ, ఏపీలోని చంద్రబాబుకు చెందిన టీడీపీ మద్దతుతో కేంద్రంలో మోడీ 3.0 సర్కార్ ఏర్పడింది. దీంతో ఈసారైనా ఆ కల నెరవేర్చుకోవాలని జేడీయూ భావించింది. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ సమావేశాల ముందు కేంద్రం ముందు ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. కానీ చివరకు నితీష్ సర్కార్‌కు చుక్కెదురైంది. హోదా ఇచ్చే ప్రసక్తేలేదని కేంద్రం తేల్చిచెప్పింది.

ఇది కూడా చదవండి: YSRCP: వైసీపీకి మరో షాక్‌.. పార్టీకి మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై..

ప్రత్యేక హోదా అనేది వెనుకబడిన రాష్ట్రాల అభివృద్ధికి దోహదపడుతుంది. కేంద్ర మద్దతుతో ఈ హోదా లభిస్తోంది. రాజ్యాంగ ప్రకారం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకపోయినప్పటికీ.. 1969లో ఐదోవ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కొన్ని రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. ఇప్పటివరకు ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్ (ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతం), ఈశాన్య రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Deputy CM Pawan Kalyan: ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు

Show comments