Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Centre Plans New Scheme For Cooking Gas Cylinder Subsidy

షాక్‌ తప్పదా..? గ్యాస్‌ సబ్సిడీ కోసం కొత్త పథకం..!

Published Date :September 24, 2021 , 4:44 pm
By Sudhakar Ravula
షాక్‌ తప్పదా..? గ్యాస్‌ సబ్సిడీ కోసం కొత్త పథకం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

సబ్సిడీతో కూడిన వంట గ్యాస్‌ ధర వెయ్యి రూపాయలకు చేరువవుతోంది.. పెట్రో ధరలతో పాటు క్రంగా గ్యాస్‌ ధరలు కూడా మండిపోతున్నాయి. ఇదే సమయంలో.. వంట గ్యాస్ సిలిండర్‌ సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.. దీనిపై అంతర్గతంగా చర్చ ప్రారంభం అయినట్టుగా తెలుస్తోంది. మరోవైపు.. వరుసగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్ల ధరలపై ప్రభుత్వం ఓ సర్వే కూడా నిర్వహించిందట.. ఆ సర్వేలో.. పెరిగిన గ్యాస్‌ ధరలను చెల్లించేందుకు వినియోగదారులు సిద్ధంగా ఉన్నట్టుగా తేలిందట.. దీంతో.. గ్యాస్‌ సిలిండర్‌పై మరింత వడ్డింపు తప్పదనే చర్చ మొదలైంది. దీని కోసమే కొత్త పథకం ప్రవేశపెట్టే యోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం.. దీనికోసం రెండు ప్రతిపాదనలపై దృష్టిసారించింది కేంద్రం.. అందులో ఒకటి.. ఎలాంటి సబ్సిడీ లేకుండా గ్యాస్ సిలిండర్లను ఏ వినియోగదారుడికైనా అమ్మడం అయితే.. రెండోది ఎంపిక చేసిన కొందరు వినియోగదారులకు మాత్రమే సబ్సిడీతో గ్యాస్ సిలిండర్లను అందించడం.. ఇప్పుడు అంతర్గత ఈ విషయంపైనే చర్చ సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి అందుతునన సమాచారం ప్రచారం.. కొత్త పథకం ద్వారా కుటుంబ వార్షిక ఆదాయం రూ.10 లక్షలు, ఆపైగా ఉన్న కుటుంబాలకు గ్యాస్ సిలిండర్‌పై ఎలాంటి రాయితీ ఇవ్వదు సర్కార్.. అవసరమైన ప్రజలకే గ్యాస్‌ సబ్సిడీ ఇచ్చేందుకు ఇది దోహదపడుతుందని భావనలో సర్కార్‌ ఉన్నట్టుగా తెలుస్తోంది.. అయితే, కరోనా నేపథ్యంలో అంతర్జాతీయగా ముడి చమురు, గ్యాస్‌ ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది మే నుంచి గత కొన్ని నెలలుగా ఎల్పీజీ సిలిండర్లపై సబ్సిడీని చాలా వరకు నిలిపివేశారు.. రెండు ప్రదిపాదనలు ఉన్నా.. క్రమంగా వంట గ్యాస్‌పై సబ్సిడీ ఎత్తివేయడమే ఎన్డీఏ సర్కార్‌ ప్లాన్‌గా ఉందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Centre
  • consumers
  • cooking gas
  • Gas cylinder Subsidy
  • LPG Subsidy

తాజావార్తలు

  • Raghav Chadha: వినియోగదారుల డబ్బుకు విలువ ఎక్కడ? వాడని డేటా ఎక్కడికి పోతుంది..!

  • PM Modi: కరోనాను ఎదుర్కొన్నట్లే.. ఈ సంక్షోభాన్ని జయిస్తాం.. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోడీ వ్యాఖ్య

  • PM Modi: గల్ఫ్‌లో ఉన్న భారతీయుల భద్రతే మా ప్రాధాన్యత.. ఇంధన భద్రతపై ప్రధాని మోడీ హామీ

  • Ambati Rambabu: పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా..

  • Rupee vs Dollar: రూపాయి ఢమాల్.. భారత రూపాయి చరిత్రలో తొలిసారి 94 దాటింది!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions