Centre Is Working On Providing 10 Lakh Jobs, Says PM Modi: కేంద్ర ప్రభుత్వం పది లక్షల ఉద్యోగాలను కల్పించేందుకు కసరత్తు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. శనివారం గుజరాత్ ప్రభుత్వం నిర్వహించిన ‘రోజ్ గార్ మేళా’లో వీడియో సందేశం ఇచ్చిన ఆయన, యువతకు ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన ఈ కార్యక్రమంలో 5,000 మంది వ్యక్తులకు గుజరాత్ పంచాయతీ సర్వీస్ బోర్డ్ నుంచి నియామక పత్రాలను అదించారు. 8 వేల మందికి గుజరాత్ సబ్ ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, లోక్ రక్షక్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా అపాయింట్‌మెంట్ లెటర్స్ అందించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నియామక పత్రాలను అందించారు.
Read Also: Russia-Ukraine War: రష్యా నౌకాదళంపై ఉక్రెయిన్ డ్రోన్ అటాక్.. బ్రిటన్ పై ఆరోపణలు
ధన్ తేరస్ రోజున జాతీయస్థాయిలో నిర్వహించిన రోజ్ గార్ మేళాలో 75,000 మందికి నియామక పత్రాలను అందించామని ప్రధాని మోదీ తన ప్రసంగంలో తెలిపారు. రాబోయే రోజుల్లో జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఇలాంటి మేళాలను నిర్వహిస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు. పది లక్షల ఉద్యోగాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని.. యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు గణనీయంగా పెరుగుతాయని ప్రధాని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఇందులో భాగం చేస్తామని అన్నారు. మీ నియామకం ప్రభుత్వ పథకాల కవరేజీని పెంచుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
గుజరాత్ కొత్త పారిశ్రామికి విధానంలో ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు గ్రేడ్ 3,4 ప్రభుత్వం పోస్టులకు ఇంటర్వ్యూ పక్రియను రద్దు చేయడం వంటి సంస్కరణలను ప్రధాని మోదీ ప్రశంసించారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే మా లక్ష్యం అని ప్రధాని అన్నారు. రాబోయే 25 ఏళ్లు దేశానికి కీలకం అని..అభివృద్ధి అవసరం అని.. సమాజం, దేశం పట్ల మీ కర్తవ్యాన్ని నిర్వహించాలని యువతకు సూచించారు. 2022లో గుజరాత్ ప్రభుత్వం ఏడాదిలో 35,000 ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించాలనే లక్ష్యాన్ని దాదాపుగా చేరుకుందని ప్రధాని మోదీ వెల్లడించారు.