Site icon NTV Telugu

Rahul Gandhi: మా బావ రాబర్ట్ వాద్రాను గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వేధిస్తోంది..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా అభియోగపత్రాన్ని కోర్టులో దాఖలు చేసింది. 2008లో గుర్గావ్‌లోని సెక్టార్ 83లో షికోహ్‌పూర్ గ్రామంలో 3.53 ఎకరాల భూమి కొనుగోలు వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందని ఈడీ ఆరోపిస్తుంది. అయితే, ఈ భూమిని స్కైలైట్ హాస్పిటాలిటీ అనే సంస్థ, ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ అనే కంపెనీ నుంచి కొనుగోలు చేసినట్టు చార్జ్‌షీట్ లో ప్రస్తావించింది. ఇక, ఈ డీల్‌కు సంబంధించిన చెల్లింపు చెక్కులను మరో కంపెనీ అయిన స్కైలైట్ రియాల్టీ ఇచ్చిందని ఈడీ వెల్లడించింది. కాగా, ఈ రెండు సంస్థలకూ రాబర్ట్ వాద్రానే యజమానిగా ఉన్నారని పేర్కొంది.

Read Also: Rishabh Pant: మరో 40 పరుగులే.. నంబర్-1 బ్యాటర్‌గా చరిత్ర సృష్టించనున్న పంత్!

ఇక, సేల్ డీడ్ నమోదైన సమయంలో స్కైలైట్ హాస్పిటాలిటీ అకౌంట్‌లో కేవలం రూ.1 లక్ష నగదు మాత్రమే ఉండగా, రూ.7.5 కోట్ల విలువైన భూమిని ఎలా కొనుగోలు చేసిందన్న అనుమానాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వ్యక్తం చేసింది. అంతేకాక, ఈ భూమిని మరుసటి రోజే స్కైలైట్ హాస్పిటాలిటీ పేరుపైకి మార్చారని తెలిపింది. సాధారణంగా భూమి టైటిల్ బదిలీ ప్రక్రియకు కనీసం మూడు నెలల సమయం పడుతుంది.. కానీ, ఈ వ్యవహారంలో 24 గంటల్లోనే ఆస్తి పేరు మారడం అనేక అనుమానాలకు దారి తీస్తుందని చెప్పుకొచ్చింది.

Read Also: Felix Baumgartner: సూపర్‌సోనిక్ స్కైడైవ్‌ మార్గదర్శకుడు ఫెలిక్స్ బామ్‌గార్ట్‌నర్ కన్నుమూత

ఇక, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేసిన రాహుల్.. నా బావ రాబర్టుని ఈ కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా వెంటాడుతోంది అని ఆరోపించారు. బావ రాబర్ట్ వాద్రా, సోదరి ప్రియాంకతో పాటు వారి పిల్లలుకు తన అండగా ఉంటాను అని పేర్కొన్నారు. మా బావపై జరుగుతున్న కుట్రలు రాజకీయంగా ప్రేరేపించబడినవి మాత్రమే అన్నారు. ఈ వేధింపులను తట్టుకోవడానికి నేను వారికి మద్దతుగా నిలుస్తాను అని వెల్లడించారు. వారందరూ ఎలాంటి హింసనైనా తట్టుకునేంత ధైర్యంగా ఉన్నారని నాకు తెలుసు.. చివరికి నిజమే గెలుస్తుంది అని రాహుల్ గాంధీ రాసుకొచ్చారు.

Exit mobile version