Trainee IAS Puja Khedkar: ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ వ్యవహారంపై కేంద్రం కమిటీ..
- కొత్త కష్టాలు కొని తెచ్చుకున్న ట్రైనీ ఐఏఎస్ అధికారి
- పూజా ఖేద్కర్ వ్యవహారంపై కేంద్రం కమిటీ ఏర్పాటు
- రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహార శైలి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆమె వికలాంగురాలిగా క్లెయిమ్ చేయడంతో దీనిని పరిశీలించేందుకు కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఏక సభ్య కమిటీ రెండు వారాల్లో తన నివేదిక సమర్పించనుంది. వికలాంగురాలిగా తప్పుడు సమాచారం అందించి ఉద్యోగం సంపాదించిందనే అభియోగాలను ఖేద్కర్ ఎదుర్కొంటోంది.
2023-బ్యాచ్ ట్రైనీ IAS అధికారి బ్యూరోక్రాట్‌గా తన పదవిని దుర్వినియోగం చేయడం వంటి తీవ్రమైన ఆరోపణల్ని ఎదుర్కొంటోంది. ఆమె తన ప్రైవేట్ ఆడి సెడాన్ కారుపై రెడ్ బల్బ్, వీఐపీ నెంబర్ ప్లేట్, గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర అనే స్టిక్కర్లు ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. వివాదం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఆమెను వాషిమ్‌కి బదిలీ చేశారు.
Also Read
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
పూజా ఖేద్కర్ పూణెలో అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ప్రొబేషనరీ స్థాయిలో ఉన్నారు. ట్రైనీగా ఉన్నప్పుడు ఆమెకు ఎలాంటి సౌకర్యాలు ఉండవు. కానీ ఆమె మాత్రం దర్పం అనుభవించాలని కోరుకుంది. అంతే తడువుగా కలెక్టరేట్‌లో ఉండే కింది స్థాయి సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. అంతటితో ఆగకుండా బెదిరింపులకు కూడా పాల్పడింది. ఇందుకు సంబంధించిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక కలెక్టరేట్‌లో ఒక ముఖ్యమైన అధికారి కార్యాలయాన్ని వాడుకోవడం.. అక్కడున్న ఫర్నీచర్‌ను బయటపడేసి.. తనకు సంబంధించిన వస్తువుల్ని తెచ్చిపెట్టుకోవడం.. ఇలా వగేరా వస్తువుల్ని తెచ్చుకుని తన ఆఫీసుగా మార్చేసుకుంది. అంతటితో ఆగకుండా ప్రైవేట్ ఆడి కారు, ఎరుపు-నీలం బెకన్ లైట్, వీఐపీ నంబర్ ప్లేట్.. కారుపై ‘మహారాష్ట్ర ప్రభుత్వం’ అనే బోర్డును కూడా ఏర్పాటు చేసుకుంది. ఇక అంతటితో ఆగకుండా తన తండ్రి దిలీప్ ఖేద్కర్‌ను కార్యాలయానికి తీసుకొచ్చి సిబ్బందిని బెదిరించింది. అన్ని ఏర్పాట్లు చేసేలా తండ్రితో ఆదేశాలు ఇప్పింది. దిలీప్.. మహారాష్ట్ర ప్రభుత్వంలో మంచి పొజేషన్‌లో ఉద్యోగ విరమణ చేశాడు. ఆ చొరవతో ఓవరాక్షన్ చేశాడు. ఇలా అధికార దుర్వినియోగానికి ఆమె పాల్పడింది. ఆమె చేష్టలతో విసిగిపోయిన కలెక్టరేట్ సిబ్బంది.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో వేటు వేశారు.
పూజా పూణె నుంచి వాషిమ్‌కు బదిలీ అయింది. పూజా ఖేద్కర్ 2023 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్. ట్రైనింగ్ పూర్తయ్యే వరకు వాషిమ్‌లోనే ఉండాలని ఆదేశాలు వెళ్లాయి. అంటే జూలై 30, 2025 వరకు అక్కడ ‘సూపర్‌న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్’గా పని చేయాల్సి ఉంది.
ఈ వివాదం రచ్చకెక్కడంతో కొత్తగా మరో సమస్యలో పూజా చిక్కుకుంది. ఐఏఎస్‌గా ఎన్నిక అయ్యాక ఆమె మెడికల్ టెస్టులకు హాజరుకాకపోవడం మరింత వివాదం చెలరేగింది. ఇందుకు సంబంధించిన ఫిర్యాదులు యూపీఎస్సీకి వెళ్లాయి. 8 రకాలైన టెస్టులకు హాజరుకాకుండానే ఆమె ట్రైనింగ్‌కు వెళ్లినట్లు సమాచారం. ఆమెకు కంటి, మానసిక సంబంధమైన కొన్ని సమస్యలున్నట్లు ఆమె అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఆమె ఆ పరీక్షలకు ఆరుసార్లు డుమ్మాకొట్టినట్లు తెలుస్తోంది. అలాగే ఎంఆర్ స్కానింగ్ కూడా హాజరుకాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆమె సమర్పించిన ఓబీసీ సర్టిఫికెట్ కూడా నకిలీది కథనాలు వెలువడుతున్నాయి. మొత్తానికి పూజా ఖేద్కర్.. కష్టాలు కొని తెచ్చుకుంది. అందుకే పెద్దలంటారు ‘అనువుగాని చోట.. నధికులమనరాదు’ అని. పాపం ఈ సూత్రాన్ని మరిచి ప్రవర్తించింది.
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..