Unregulated lending: లోన్ యాప్‌ల వేధింపులతో ఎంతో మంది ప్రజలు సూసైడ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకు రాబోతుంది. చట్టబద్ధమైన సంస్థ ద్వారా కాకుండా, భౌతికంగా లేదా ఆన్‌లైన్‌లో లోన్ ఇచ్చే వారికి 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష, కోటి రూపాయల జరిమానా విధించేలా ముసాయిదాను మోడీ సర్కారు రూపొందిస్తుంది. ఇది అమలైతే బంధువులకు ఇచ్చే అప్పులు మినహా వడ్డీ వ్యాపారులు, లోన్ యాప్‌లు అప్పులు ఇవ్వడం ఇక నుంచి కుదరదు అన్నమాట.
Read Also: Smartphones Launch 2025: వచ్చే ఏడాదిలో లాంచ్ కానున్న స్మార్ట్‌ఫోన్స్ ఇవే!
అయితే, 2025 ఫిబ్రవరి వరకు ప్రజల అభిప్రాయాల కోసం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్‌రెగ్యులేటెడ్ లెండింగ్ యాక్టివిటీస్ (డ్రాఫ్ట్) బిల్లును నిషేధిస్తూ ముసాయిదా బిల్లును రిలీజ్ చేసింది. నియంత్రణ లేని రుణ కార్యకలాపాలను నిషేధించడం, ఆర్బీఐ లేదా ఇతర నియంత్రణ సంస్థల నుంచి పర్మిషన్ లేకుండా పబ్లిక్ లెండింగ్‌లో పాల్గొనకుండా అనధికార వ్యక్తులు, సంస్థలను నిషేధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది.