NTV Telugu Site icon

CM Pinarayi Vijayan: వయనాడ్ బాధితులను కేంద్ర సర్కార్ అవమానిస్తుంది..!

Kerala

Kerala

CM Pinarayi Vijayan: వయనాడ్ విషాదానికి అక్రమ మైనింగ్, అనుమతి లేని మానవ నివాసాలే కారణమంటూ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ చేసిన కామెంట్స్ పై కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఘాటుగా స్పందించారు. భూపేందర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు వయనాడ్ బాధితులను అవమానించేలా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. కేరళలోని కొండ ప్రాంతాలపై కనీస అవగాహన ఉన్న ప్రజలెవరూ అక్కడ నివసిస్తు్న్న ప్రజలను అక్రమ వలసదారులుగా పేర్కొనరని సీఎం చెప్పుకొచ్చారు.

Read Also: Dorababu Pendem: వైసీపీకి మరో షాక్.. పార్టీకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు రాజీనామా

కాగా, కేంద్రమంత్రి ఇలాంటి ఆరోపణలు చేయడం ద్వారా విపత్తులో ప్రభావితమైన ప్రజలను అవమానిస్తున్నారని సీఎం పినరాయి విజయన్ పేర్కొన్నారు. ఈ అనధికార స్థిరనివాసులు ఎవరు? కొండచరియలు విరిగిపడి చనిపోయిన ఎస్టేట్ కార్మికులా? లేక తమకున్న చిన్నపాటి భూముల్లో జీవించే సామాన్య ప్రజలా? అంటూ ప్రశ్నించారు. ఆ ప్రాంతాల్లో నివసాముండే ప్రజలను అనధికారులు అనే ముద్ర వేయలేవమని ముఖ్యమంత్రి విజయన్ చెప్పుకొచ్చారు.

Read Also: US arrests Pakistani: డొనాల్డ్ ట్రంప్‌ సహా మరికొందరి హత్యకు ప్లాన్ చేసిన పాకిస్థానీ..

అయితే, భారీ విషాదం నేపథ్యంలో లోతైన ఆలోచన, సమిష్టి కృషి అవసరమైన సమయంలో కొంత మంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం దీన్ని వినియోగించుకుంటున్నారు అని సీఎం విజయన్ మండిపడ్డారు. ఇక్కడి వాస్తవ పరిస్థితుల గురించి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. రాష్ట్రంలోని కొండ ప్రాంతాల వలసలకు ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు వయనాడ్ పై తప్పుడు ప్రచారం చేస్తుందో ఆన్సర్ చెప్పాలని ముఖ్యమంత్రి పినరాయి విజయన్ డిమాండ్ చేశారు.

Show comments