Dorababu Pendem: వైసీపీకి మరో షాక్.. పార్టీకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు రాజీనామా
- వైసీపీకి పెద్ద దెబ్బ
- పార్టీకి రాజీనామా చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు
- జగన్ తో తనకు ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం
- కూటమిలో ఏదో ఒక పార్టీకి వెళ్తానని వెల్లడి
- జనసేనలోకి వెళ్లనున్నట్లు ఊహాగానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి షాకిచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత కొద్ది రోజులుగా పార్టీ మార్పుపై వార్తలొస్తున్న నేపథ్యంలో నేడు రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ.. “వైసీపీ కి రాజీనామా చేస్తున్నాను. 25 ఏళ్ళు గా పిఠాపురం ప్రజానీకం తో మమేకం అయి ఉన్నాను. పిఠాపురం ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. నాకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవు. అనుచరులుతో చర్చించి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటాను. పిఠాపురం లోనే ఉంటాను. ప్రజలందరికీ అండగా ఉంటాను.” అని ఆయన వ్యాఖ్యానించారు.
READ MORE: US arrests Pakistani: డొనాల్డ్ ట్రంప్ సహా మరికొందరి హత్యకు ప్లాన్ చేసిన పాకిస్థానీ..
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
కూటమి పార్టీలతో చేరనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కానీ..కూటమీలో ఏ పార్టీ అనేది నిర్ణయాన్ని మాత్రం కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత వెల్లడిస్తానని తెలిపారు. జగన్ తో తనకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. “నాకు ఎవరితో ఇబ్బంది అనేది మీకు తెలుసు. జనసేనకి, పవన్ కి నా వలన ఉపయోగం ఉన్న సూచనలు చేస్తాను. కూటమిలో అన్ని పార్టీలు నుంచి ఆహ్వానం ఉంది. పెత్తనం చేయడానికి వెళ్లడం లేదు” అని మాజీ ఎమ్మె్ల్యే దొరబాబు పేర్కొన్నారు.
READ MORE:Serena Williams-Restaurant: పారిస్ రెస్టరెంట్‌లో సెరెనాకు అవమానం.. వివరణ ఇచ్చిన మేనేజ్‌మెంట్!
కాగా.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత వైఎస్సార్‌సీపీకి పలువురు నేతలు గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. తాజాగా కీలకమైన పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పార్టీకి వీడ్కోలు పలికారు. గత కొద్ది రోజులుగా అనుచరులకు పార్టీకి రాజీనామా చేయడంపై సంకేతాలు ఇచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. జనసేన పార్టీలోకి వెళుతారని జోరుగు టాక్ నడుస్తోంది.
YCP, Latest Telugu News, AP News, Pithapuram, Pawan Kalyan, Former MLA Pendem Dorababu, Pendem Dorababu, Jana Sena, Alliance Parties, Jagan
- Tags
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!