COVID 19: కేంద్రం హెచ్చరికలు.. ప్రజల్లో మళ్లీ ఆందోళన..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇక కరోనా మహమ్మారి పని అయిపోయింది.. థర్డ్ వేవ్ తర్వాత వినిపించిన మాటలు ఇవి.. మహమ్మారి పోదు.. కానీ, బలనహీనపడి.. సాధారణ స్వరంలా ఎటాక్ చేస్తుందని చెప్పిన పరిశోధనలు కూడా ఉన్నాయి.. అయితే, దేశంలో కరోనా మళ్లీ విజృంభించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. జనం అప్రమత్తంగా ఉండకపోతే… కోవిడ్ వ్యాపిస్తుందనే వార్తలు మళ్లీ అందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. స్టెల్త్ వేరియంట్ రూపంలో… ముప్పు పొంచి ఉందంటున్నారు. ఇండియాలో క్రమంగా కరోనా కేసులు తగ్గిపోతుండటంతో అందరూ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా కథ ముగిసిపోయినట్లేనని సంతోషంలో మునిగితేలుతున్నారు. అయితే, ఇదే సమయంలో కరోనా కథ ఇంకా అయిపోలేదని వార్నింగ్ ఇస్తున్నారు.
Read Also: Ukraine Russia War: రంగంలోకి ఆత్మాహుతి డ్రోన్లు..!
Also Read
మరోవైపు, చైనాలో పెరుగుతున్న కేసులను చూస్తుంటే.. భారత్‌కు మరోసారి కరోనా ముప్పు తప్పేలా లేదు. ఈసారి కరోనా ఏకంగా 75 శాతం మందిపై విరుచుకుపడొచ్చని కొవిడ్-19 టాస్క్ గ్రూపుకు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ఎన్కే అరోరా హెచ్చరించారు. ఇక, ఇప్పటికే కరోనా బీఏ.2 వేరియంట్ వల్ల దేశంలో మూడో వేవ్ వచ్చింది. ఇప్పటికీ ఆ వేరియంట్ ఆనవాళ్లు ఉన్నాయి. దీంతో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు జులైలో నాలుగో వేవ్ దశ ప్రారంభమవుతుందని ఐఐటి ఖరగ్ పూర్ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మొత్తానికి.. కరోనా ముగిసిపోయిందనుకునే లోపే..మరో ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలతో ఆందోళన చెందుతున్నారు జనం.. కేసులు తగ్గుముఖం పట్టడంతో.. అన్ని ఆంక్షలు ఎత్తివేసి.. సాధారణ జీవితం గడుపుతోన్న సమయంలో.. కేంద్రం వార్నింగ్‌లు మళ్లీ కలవరానికి గురిచేస్తున్నాయి.
తాజావార్తలు
-
EC: ఎన్నికల సంఘాన్ని ఏలుతున్నదెవరు?
-
Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
-
Renault Rafale Hypnotic: రెనాల్ట్ రఫేల్ హిప్నోటిక్ లాంచ్.. 300hp పవర్, 1,000KM రేంజ్‌తో అదిరిపోయే SUV
-
Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
-
AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
ట్రెండింగ్
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?