ఇప్పుడు అన్నింటికీ ఆధార్ నంబరే ఆధారం.. ఏ రిక్వెస్ట్ పెట్టాలన్నా ఆధార్ కార్డ్ కాపీని జత చేయాల్సిందే.. దీంతో, చాలా వరకు స్మార్ట్ ఆధార్ కార్డులను క్యారీ చేస్తున్నారు ప్రజలు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆధారు కార్డులను ఎక్కడపడితే అక్కడ జిరాక్స్ తీయించడం.. కొన్నిసార్లు సరిగారాలేదని వదిలేయడం.. మరికొన్నిసార్లు మర్చిపోవడం చేస్తూనే ఉన్నారు.. కొందరైతే.. తమ ఆధార్ వివరాలను సోషల్ మీడియాలోను పంచుకుంటున్నారు.. దీనిపై ఆధార్ కార్డు వినియోగదారులకు వార్నింగ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.. ఆధార్‌కార్డు, వాటి కాపీలను ఎక్కడపడితే అక్కడ వదిలేయొద్దని ప్రజలకు సూచించింది. ఆధార్ నెంబర్‌ను సోషల్‌మీడియా, ఇతర బహిరంగ వేదికల్లో పంచుకోవద్దని.. సోషల్ మీడియా ప్లాట్‌పామ్‌లలో ఆధార్ నెంబర్‌ను షేర్ చేయొద్దని పేర్కొంది.
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
అంతేకాదు, ఆధార్‌నెంబర్‌ను ఇతరులతో పంచుకొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అలర్ట్ చేసింది.. ఓటీపీని ఎవ్వరితో పంచుకోవద్దని పేర్కొంది. ప్రతి ఆధార్‌కార్డుదారు తన ఈమెయిల్‌ను ఆధార్‌కు అనుసంధానం చేసుకోవాలని సూచించింది… ఆధార్‌కు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే 1947 టోల్‌ఫ్రీ నెంబర్‌ను 24 గంటల్లో ఎప్పుడైనా సంప్రదించవచ్చని ప్రకటించింది కేంద్రం.. అయితే, ప్రతిదీ ఇప్పుడు ఆధార్ నంబర్‌కు లింక్ చేయబడి ఉండడంతో.. సదరు వ్యక్తులకు సంబంధించిన ఏ లావాదేవీలైనా కేటుగాళ్లు ఇట్టే కనిపెట్టే ప్రమాదం ఉంది.. అంతేకాదు.. బ్యాంకు ఖాతాలకు కూడా అనుసంధానం చేసి ఉంటారు కాబట్టి.. మీకు బ్యాంకు ఖాతా ఖాళీ చేసే అవకాశం కేటుగాళ్లకు ఇచ్చినవారైతారు.. అందుకే.. ఇప్పటికైనా అప్రమత్తం కావాలి.. ఎక్కడపడితే అక్కడ ఆధార్ నంబర్‌ను పంచుకోవడం వంటి పనులకు స్వస్తిపలకాలి.