Naravane Book: నరవణే పుస్తకం రాహుల్‌గాంధీ చేతికి ఎలా వచ్చింది? కేంద్రం ఆరా
- నరవణే పుస్తకంపై దుమారం
- పుస్తకం రాహుల్‌గాంధీ చేతికి ఎలా వచ్చింది?
- పార్లమెంట్లో ప్రత్యక్షం కావడంపై కేంద్రం ఆరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మాజీ ఆర్మీ చీఫ్ నరవణే రాసిన పుస్తకం తీవ్ర దుమారం రేపుతోంది. గత వారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మాపంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మాట్లాడుతూ… మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే రాసిన ‘‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’’లోని ఆత్మకథకు సంబంధించిన అంశాలను లేవనెత్తారు. అంతే వెంటనే కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అడ్డుకున్నారు. రాహుల్ గాంధీ మైక్ కట్ చేశారు. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది.

Also Read
- Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 78 రోజుల బోనస్‌కు క్యాబినెట్ ఆమోదం?
- Patna High Court: "మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం".. హైకోర్టు సంచలన తీర్పు..
- Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
మనోజ్ నరవణే మాజీ ఆర్మీ చీఫ్. భారత సైన్యంలో నాలుగు దశాబ్దాలు పాటు సేవలందించారు. 1962 తర్వాత జరిగిన అతిపెద్ద భారత్-చైనా ఘర్షణలను పర్యవేక్షించిన అధికారి. రిటైర్డ్ అయిన తర్వాత నరవణే ఆత్మకథ రాశారు. ఇందులో దేశానికి సంబంధించిన అంతర్గత విషయాలు పొందిపరిచారు. దీంతో ఈ పుస్తకం ప్రచురణకు కేంద్రం అనుమతించలేదు. అయినా కూడా ప్రచురించని పుస్తకం కాపీ రాహుల్ గాంధీకి చేతికి ఎలా వచ్చింది? అని కేంద్రం తర్జనభర్జన పడుతోంది. ప్రస్తుతం ఈ విషయంపై కేంద్రం ఆరా తీస్తోంది.
పుస్తకంలో అసలేముంది?
మనోజ్ నరవణే.. మాజీ ఆర్మీ చీఫ్. తన జీవితంలో జరిగిన అంశాలను ఆత్మకథగా రాసుకున్నారు. ఇందులో అనేక అంశాలను ప్రస్తావించారు. 2020లో భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, తూర్పు లడఖ్‌లో సైనిక చర్యలు, ప్రభుత్వ-సైన్యం మధ్య నిర్ణయం తీసుకునే ప్రక్రియ, వ్యూహాత్మక ఆలోచనలతో సహా అతని సైనిక అనుభవాలను వివరించారు. ఈ పుస్తకంలోని కొన్ని అంశాలు డిసెంబర్ 2023లో మీడియాలో ప్రచురించబడ్డాయి. చైనాతో ఘర్షణ సమయంలో తలెత్తిన అంశాలను ప్రస్తావించారు. ఆ సమయంలో ‘నియంత్రణ’లో లేదని పేర్కొన్నారు. పుస్తకంలోని కొన్ని అంశాలు సున్నితంగా ఉన్నాయి. ఎందుకంటే.. జాతీయ భద్రత, వ్యూహాత్మక నిర్ణయాలు నేరుగా ప్రస్తావించబడ్డాయి. దీంతో అధికారికంగా ప్రచురణకు నోచుకోలేదు.
(ఎ) 1954 ఆర్మీ రూల్స్‌లోని సెక్షన్ 21 ప్రకారం..సర్వీస్ సబ్జెక్టులు, భద్రతా విషయాలపై ఎటువంటి విషయాలను ప్రచురించకూడదు. ఇక సైనిక సంబంధిత సమాచారాన్ని ప్రత్యక్షంగానీ.. పరోక్షంగానీ పత్రికలకు గానీ.. ఇతర ఏ రూపంలోనూ ప్రచురణ చేయకూడదు. ఇక కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా పుస్తకం లేదా కథనాన్ని ప్రచురించకూడదు. ఇక సర్వీస్ సమాచారాన్ని కూడా ఎవరితో పంచుకోవడానికి వీలుండదు. ఇవన్నీ ఆర్మీ నిబంధనలోకి వస్తాయి. ఈ నేపథ్యంలోనే మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే రాసిన ఆత్మకథ అధికారికంగా ప్రచురణ జరగలేదు. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం సమీక్షలో ఉండడంతో ప్రచురణ జరగలేదు.
అయితే గత వారం రాహుల్‌గాంధీ జాతీయవాదం అంశంపై పార్లమెంట్లో మాట్లాడుతూ. నరవణేకు సంబంధించిన అంశాలు ఒక మ్యాగజైన్లో ప్రచురితమైన అంశాలను లేవనెత్తారు. వెంటనే కేంద్రమంత్రులు అడ్డుతగిలారు. అంతేకాకుండా స్పీకర్ మైక్ కూడా కట్ చేశారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు ఆందోళన దిగారు. మరుసటి రోజే రాహుల్ గాంధీ నరవణే రాసిన పుస్తకాన్ని పార్లమెంట్ ఆవరణలో మీడియాకు చూపించారు. అవసరమైతే ప్రధాని మోడీకి అందిస్తానని చెప్పారు. అంటే ఈ పుస్తకం ఏప్రిల్, 2025కు ముందే ప్రచురణ జరిగినట్లుగా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ పుస్తకం ముద్రణపై కేంద్రం సీరియస్‌గా ఆరా తీస్తోంది.
What's Written In Gen. Naravane's Memoir That Scares The Life Out Of Modi Govt ❓❓ pic.twitter.com/afImest3iF
— Congress (@INCIndia) February 2, 2026
తాజావార్తలు
-
AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
-
Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 78 రోజుల బోనస్‌కు క్యాబినెట్ ఆమోదం?
-
Trump Warning: ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
-
Patna High Court: “మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం”.. హైకోర్టు సంచలన తీర్పు..
-
WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!