NTV Telugu Site icon

Union Cabinet: రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్రం శుభవార్త.. PMGKAY పొడగింపు..

Pmgkay

Pmgkay

రేషన్ కార్డు ఉన్న వారికి కేంద్రం శుభవార్త అందించింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పొడిగిస్తూ కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం ప్రకటించారు. కరోనా సమయంలో పేద ప్రజలకు ఉచిత రేషన్ అందించేందుకు కేంద్రం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఈ పథకాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 81 కోట్ల మంది పేద ప్రజలు లబ్ధీ పొందుతన్నారు. అయితే ఇప్పుడు ఈ పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ నవంబర్ 29న వెల్లడించారు.

Also Read: Telangana Elections 2023: తెలంగాణలో రేపే పోలింగ్.. పూర్తైన ఎన్నికల సామాగ్రి పంపిణీ..

ఈ పొడగింపు జనవరి 1, 2024 నుంచి డిసెంబర్, 2028 వరకు వర్తిస్తుందని, దీని ద్వారా పేద ప్రజలకు కేంద్ర సర్కార్ ఉచితంగా బియ్యం పంపిణీ చేయనుందని చెప్పారు. ఈ నిర్ణయంతో కేంద్రంపై అదనంగా మరో రూ.11.8 లక్షల కోట్ల భారం పడుతుందని ఆయన తెలిపారు. కాగా ఈ పథకాన్ని ఏప్రిల్ 2020లో కరోనా లాక్ డౌన్ విధించిన క్రమంలో కేంద్రం పీఎంజీకేఏవై పేరుతో ప్రకటించింది. దీనికి ద్వారా రేషన్ కార్డు ఉన్నవారు నెలల రూ. 5 కిలోల ఉచిత రేషన్ అందించింది. అయితే మొదట మూడు నెలలకు మాత్రమే ఉచితంగా రేషన్ ఇచ్చేందుకు ఈ స్కీమ్ తెచ్చారు. ఆ తర్వాత పలు మార్లు ఈ స్కీమ్ పొడిగించింది కేంద్రం. ఇప్పుడు మరో 5 ఏళ్లు పొడగించి ఉచితంగ రేషన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ పథకం డిసెంబర్ 2023 లో అంటే వచ్చే నెలలో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర కెబినెట ఈ పథకాన్ని పొడగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పొడగింపుతో లబ్ధిదారులు 2028 వరకు ఉచిత రేషన్ పొందవచ్చు.

Also Read: Telangana Assembly Elections 2023: రేపు సెలవు ఇవ్వని కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు: ఎన్నికల సంఘం