Aadhar Card: ఆధార్ జిరాక్స్ కాపీల ప్రకటనపై మాట మార్చిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆధార్ కార్డుల దుర్వినియోగాన్ని నిరోధించడం కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఓ ప్రకటన జారీ చేసింది. ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలు ఇతరులతో షేర్ చేసుకునే సమయంలో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించే విధంగా మాస్క్‌డ్ జిరాక్స్ కాపీలు ఉండాలని తెలిపింది. ఈ ప్రకటన దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో విమర్శలు వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆధార్ జిరాక్స్ కాపీలపై మాట మార్చింది.
Smart Watches: ఈ స్మార్ట్ వాచ్ లు ట్రై చేశారా?
Also Read
దేశ పౌరులు ఆధార్ జిరాక్స్ కాపీలను కాకుండా మాస్క్‌డ్ కాపీలను ఇవ్వాలని సూచించామని… అయితే జిరాక్స్ కాపీ ఇచ్చే సమయంలో సాధారణ వివేకాన్ని పాటిస్తే చాలు అని.. ఆధార్ ఐడెంటిటీ అథెంటికేషన్ ఎకో సిస్టమ్ అనేది మీ ఆధార్ కార్డు గోప్యతను రక్షిస్తుందని తాజాగా యూఐడీఏఐ ట్వీట్ చేసింది. తమ ప్రకటనను చాలా మంది తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని.. కావున గతంలో విడుదల చేసిన ప్రకటనను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. కాగా ఆధార్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రజలు పబ్లిక్ కంప్యూటర్లను ఉపయోగించుకోవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇంటర్నెట్ కేఫ్‌లలో కంప్యూటర్ల నుంచి ఆధార్ కార్డులను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ చేసుకోవద్దని. ఒకవేళ చేసుకుంటే దుర్వినియోగం అయ్యే అవకాశముందని హెచ్చరించింది.
#Aadhaar holders are advised to exercise normal prudence in using and sharing their Aadhaar numbers.
In view of possibility of misinterpretation the press release issued earlier stands withdrawn with immediate effect.https://t.co/ChmbVs8EjJ@GoI_MeitY @PIB_India— Aadhaar (@UIDAI) May 29, 2022
తాజావార్తలు
-
‘Peddi’: టాలీవుడ్ అంటే అంత అలుసా? ‘పెద్ది’ విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
-
Akhilesh Yadav: రామమందిరంలో కానుకలు మాయం?.. అఖిలేష్ సంచలన ఆరోపణ
-
Harish Rao : రేవంత్‌కు రైతుల శాపం తప్పదు.. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది
-
Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
-
Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!