కేంద్ర కేబినెట్ శుక్రవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ సమావేశం తర్వాత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. స్కిల్ ఇండియా కార్యక్రమానికి మరో రూ.8,800 కోట్లను కేబినెట్ ఆమోదించిందని తెలిపారు. ‘‘ఈ కార్యక్రమాలు నిర్మాణాత్మక నైపుణ్య అభివృద్ధి, ఉద్యోగ శిక్షణ, సమాజ ఆధారిత అభ్యాసాన్ని అందించడం, అట్టడుగు వర్గాలతో సహా పట్టణ మరియు గ్రామీణ జనాభా రెండింటికీ అధిక నాణ్యత వృత్తి విద్యను పొందేలా చూడటం లక్ష్యంగా పెట్టుకున్నాయి’’ అని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Ayodhya: అయోధ్య రాముడి దర్శనం వేళల్లో మార్పులు.. ఇకపై..!
స్కిల్ ఇండియా ప్రోగ్రామ్‌ను 2026 వరకు కొనసాగించడానికి, పునర్నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని కోసం రూ. 8,800 కోట్లు కేటాయించినట్లుగా పేర్కొంది. ఈ విషయాన్ని సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం.. 2022-23 నుంచి 2025-26 వరకు రూ. 8,800 కోట్ల ఓవర్‌లే వ్యయంతో 2026 వరకు ‘స్కిల్ ఇండియా ప్రోగ్రామ్’ కొనసాగింపునకు ఆమోదం తెలిపిందని ఆయన చెప్పారు.
ఇది కూడా చదవండి: Tamilnadu : కదులుతున్న రైలులో గర్భిణీ స్త్రీపై అత్యాచారం.. తర్వాత బయటకు తోసేశారు