LPG Crisis: ఎల్పీజీ సంక్షోభం మధ్య కిరోసిన్‌పై కేంద్రం కీలక నిర్ణయం..
- ఎల్పీజీ సంక్షోభం మధ్య కిరోసిన్‌పై కేంద్రం కీలక నిర్ణయం..
- పీడీఎస్ వ్యవస్థ, బంకుల ద్వారా అమ్మకాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG Crisis: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం భారత ఇంధనరంగంపై పడింది. ఇరాన్ హార్ముజ్ జలసంధిని దిగ్భందించడం, గల్ఫ్ దేశాల్లోని ఆయిల్, గ్యాస్ ఫీల్డ్‌లపై దాడి చేయడంతో ఆ ప్రాంతం నుంచి ప్రపంచానికి సరఫరా అయ్యే చమురు, గ్యాస్ ఎగుమతులపై ప్రభావం పడింది. ముఖ్యంగా, భారత్‌లో ఎల్పీజీ సంక్షోభం నెలకొంది. అయితే, ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఇళ్లకు కిరోసిన్ సరఫరాను సులభతరం చేయడానికి ప్రభుత్వం పెట్రోలియం భద్రత, లైసెన్సింగ్ నిబంధనల్ని తాత్కాలికంగా సడలించింది.
Read Also: DMK manifesto: ‘‘పెన్షన్లు పెంపు, ఫ్రీ ల్యాప్‌లాప్‌లు, ఉచిత విద్యుత్’’.. డీఎంకే మానిఫెస్టో రిలీజ్..
Also Read
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
మార్చి 29న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం… ప్రజలు ఇంధన కొరతను ఎదుర్కోకుండా పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ, ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్, గుజరాత్‌తో సహా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) కింద 60 రోజుల పాటు సుపీరియర్ కిరోసిన్ ఆయిల్ (SKO) తాత్కాలిక సరఫరాకు అనుమతి ఇచ్చింది.
పీడీఎస్ వ్యవస్థతో పాటు కొత్తగా తెచ్చిన మార్పుల వల్ల ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎంపిక చేసిన పెట్రోల్ పంపుల్లో కిరోసిన నిల్వ చేయడానికి, పంపిణీ చేయడానికి అనుమతి లభిస్తుంది. ఎంపిక చేసిన బంకుల్లో ప్రతీ అవుట్ లెట్ 5000 లీటర్ల కిరోసిన్ నిల్వ చేయనున్నారు. దీని కోసం ప్రతీ జిల్లాకు గరిష్టంగా 2 పెట్రోల్ పంపుల్ని కేటాయిస్తారు. వేగవంతమైన పంపిణీని సులభతరం చేయడానికి డీలర్లు, రవాణాదారులకు కొన్ని లైసెన్సింగ్ అవసరాల నుండి కూడా మినహాయింపు ఇవ్వబడింది. ఈ కిరోసిన్ వంట, దీపాలు వెలిగించడం వంటి గృహ వినియోగానికి మాత్రమే సరఫరా చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
తాజావార్తలు
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు