Site icon NTV Telugu

CBSE: డయాబెటిస్‌ విద్యార్థులకు శుభవార్త

Exam

Exam

దేశ వ్యాప్తంగా పరీక్షల కాలం వచ్చేసింది. ఇప్పటికే ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమైపోయాయి. ఇక త్వరలోనే పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యార్థులంతా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. అయితే కొంత మంది విద్యార్థులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి విద్యార్థుల (Students) కోసం సీబీఎస్‌ఈ బోర్డు (CBSE Board) ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మార్గదర్శకాలను జారీ చేసింది.

 

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2024 బోర్డు పరీక్షలకు హాజరయ్యే టైప్-1 డయాబెటిస్‌తో (Diabetes) బాధపడుతున్న విద్యార్థుల కోసం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిగణనలోకి తీసుకుని మార్గదర్శకాలను విడుదల చేసినట్లు CBSE తెలిపింది.

 

మార్గదర్శకాల ప్రకారం.. విద్యార్థులు ఈ క్రింది వస్తువులను తీసుకెళ్లేందుకు అనుమతించింది.

  1. చక్కెర మాత్రలు/చాక్లెట్/కాండీ
    అరటి/ఆపిల్/ఆరెంజ్ పండ్లు
    శాండ్‌విచ్ మరియు ఏదైనా అధిక ప్రోటీన్ ఆహారం వంటి స్నాక్ ఐటమ్స్
    డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం అవసరమైన మందులు
    వాటర్ బాటిల్ (500 ml)
    గ్లూకోమీటర్ మరియు గ్లూకోజ్ టెస్టింగ్ స్ట్రిప్స్
    నిరంతర గ్లూకోజ్ మానిటరింగ్ (CGM) యంత్రం
    ఫ్లాష్ గ్లూకోజ్ మానిటరింగ్ (FGM) యంత్రం లేదా ఇన్సులిన్ పంపులు

 

ఈ సౌకర్యాలను పొందేందుకు విద్యార్థులు ఈ విధానాలను అనుసరించాలి

LOC నమోదు/సమర్పణ సమయంలో విద్యార్థులు టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్నారనే సమాచారాన్ని తప్పనిసరిగా అందించాలి.
పాఠశాల/విద్యార్థి/తల్లిదండ్రులు పరీక్ష ప్రారంభానికి కనీసం ఒక రోజు ముందు పరీక్షా కేంద్రానికి చేరుకుని.. విద్యార్థులు తీసుకెళ్లాల్సిన వస్తువుల గురించి సెంటర్ సూపరింటెండెంట్‌కు తెలియజేయాలి.
పరీక్ష రోజు కూడా, విద్యార్థి పరీక్షల ప్రారంభానికి కనీసం 45 నిమిషాల ముందు పాఠశాలకు చేరుకోవాలి. వారు 9:45 గంటలకు హాల్‌కు చేరుకోవాలి.

 

ఈ పత్రాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి.

పరీక్షల సమయంలో CM/FGM/ఇన్సులిన్ పంప్ కోసం వైద్య నిపుణుడి సిఫార్సులు.
విద్యార్థులకు CM/FM/ఇన్సులిన్ పంప్ అందించబడుతుంది
కమ్యూనికేషన్ పరికరం మాత్రం తీసుకురాకూడదు

Exit mobile version