Site icon NTV Telugu

Karur stampede: కరూర్ తొక్కిసలాట.. యాక్టర్ విజయ్ కార్యాలయానికి సీబీఐ..

Karur Stampede

Karur Stampede

Karur stampede: తమిళ స్టార్ యాక్టర్, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ నిర్వహించిన కరూర్ ర్యాలీ విషాదంగా మారిన సంగతి తెలిసిందే. తొక్కసలాట జరిగి ఏకంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ సంఘటనపై ప్రాథమిక వివరాలు కోరడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు సోమవారం తమిళగ వెట్రి కజగం (టీవీకే) ప్రధాన కార్యాలయానికి వెళ్లారు.

Read Also: Siddaramaiah: ‘‘మీకు అడగటానికి వేరే ప్రశ్నలే లేవా.?’’ మీడియాపై సీఎం ఆగ్రహం..

ప్రచారంలో పాల్గొన్న వారి వివరాల గురించి అధికారులు అడిగారని, సీసీటీవీ ఫుటేజ్ కోరారని టీవీకే నేత నిర్మల్ కుమార్ అన్నారు. తాము ఇప్పటికే సిట్‌కు ఈ వివరాలు అందించినట్లు చెప్పారు. అవసరమైన సమాచారాన్ని అందించడానికి మాత్రమే సమన్లు జారీ చేసినట్లు వెల్లడించారు. సీబీఐ ఫస్ట్ లెవల్ దర్యాప్తు కోసం వివరాలు అడిగారని, వాటిని మూడు నాలుగు రోజుల్లో అందిస్తామని చెప్పారు.

తొక్కిసలాట జరిగిన రోజుల ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి సీబీఐ అధికారులు అధునాతన 3D లేజర్ స్కానింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ సంఘటనపై నిష్పాక్షిక దర్యాప్తుకు సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది. సుప్రీం ఆదేశాల మేరకు సీబీఐ త్యేక దర్యాప్తు బృందం (SIT) నుండి కేసును స్వాధీనం చేసుకుంది. తొక్కిసలాట జరిగిన రోజు అక్కడ ఏం జరిగిందనే వివరాలు తెలుసుకునేందుకు స్థానిక వ్యాపారులు, నివాసితులు, ఫోటో గ్రాఫర్‌లను అధికారులు ప్రశ్నించి వివరాలు సేకరించనున్నారు.

Exit mobile version