UGC-NET Paper Leak: పేపర్ లీక్ కేసు.. దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపై దాడి..
- యూజీసీ-నెట్ పేపర్ లీక్‌పై సీబీఐ దర్యాప్తు..
- దర్యాప్తు అధికారులపై గ్రామస్తుల దాడి..
- బీహార్ రాష్ట్రంలో ఘటన..
- నకిలీ అధికారులుగా పొరబడిన గ్రామస్తులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UGC-NET Paper Leak: నీట్, యూజీసీ-నెట్ పేపర్ లీకులు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. యూజీసీ-నెట్ పేపర్ లీక్ కావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) పరీక్షల్ని రద్దు చేసింది. ఈ కేసును ప్రస్తుతం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) విచారిస్తుంది. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇదిలా ఉంటే కేసు దర్యాప్తు కోసం వెళ్లిన సీబీఐ అధికారులపై దాడి జరిగింది. బీహార్‌లోని నవడా జల్లాలోని గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. అయితే, నకిలీ అధికారులని భావించి గ్రామస్తులు దాడికి పాల్పడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో దాదాపుగా 200 మందిపై కేసులు నమోదు చేశారు.
Read Also: Parenting Tips: పిల్లలు దూకుడుగా మారుతున్నారా? వారిని నియంత్రించడం తప్పనిసరి.. ఈ నియమాలు పాటించండి..
Also Read
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
దాడిని సెల్ఫోన్లో రికార్డ్ చేశామని, వీడియోల ఆధారంగా దాడికి పాల్పడిన వ్యక్తుల్ని గుర్తించామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నలుగురిని అరెస్ట్ చేశారు. స్థానిక పోలీసు సీనియర్ అధికారి అంబరీష్ రాహుల్ మాట్లాడుతూ, దాడి జరిగినప్పుడు సీబీఐ టీమ్ కసియాదిహ్ గ్రామంలో ఉందని తెలిపారు. స్థానిక పోలీసులు అధికారుల్ని రక్షించారు. టీమ్‌లోని నలుగురు అధికారులు, ఒక మహిళా కానిస్టేబుల్ ఒక వ్యక్తి సెల్‌ఫోన్ ట్రాక్ చేస్తూ ఆ గ్రామానికి వెళ్లారు. అయితే, వారిని గ్రామస్తులు నకిలీ అధికారులని కొట్టారు. వాహనాలను ధ్వంసం చేశారు. ఊహించని దాడితో అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసుల సమక్షంలో ఈ బృందం విచారణ చేపట్టింది. లొకేషన్ ఆధారంగా రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Virat Kohli: ఏ తప్పేముంది.. విరాట్ కోహ్లీ అది కోరుకోవడం సహజమే: రహనే
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
-
AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
-
DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!