NTV Telugu Site icon

Rahul Gandhi: “కులగణన”తో మోసం.. నితీష్‌ కుమార్‌పై రాహుల్ గాంధీ ఆరోపణ

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: బీహార్‌లో నితీష్ కుమార్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన ప్రజల్ని మోసం చేయడానికే అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో అభివృద్ధి పనులు చేయడానికి కులగణన అనేది చాలా అవసరమని అన్నారు. శనివారం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తమ పార్టీ కులగణనకు కట్టుబడి ఉందని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో రాజ్యాంగాన్ని అణగదొక్కాలని చూస్తు్న్నాయని, అణగారిన వర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు.

Read Also: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ దాడి కేసు.. ఛత్తీస్‌గఢ్‌లో నిందితుడి అరెస్ట్..

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ‘‘నిజమైన స్వాతంత్ర్యం’’ వ్యాఖ్యలు దేశ రాజ్యాంగానికి విరుద్ధం అని అన్నారు. పాట్నాలోని బాపు సభగర్‌లో జరిగిన ‘‘సంవిధాన్ సురక్ష సమ్మేళన్’’లో ఆయన మాట్లాడారు. ‘‘ఈ దేశంలో దళితులు, మైనారిటీలు, సామాజికంగా అణగారిన ప్రజలు 90 శాతం ఉన్నారు, కానీ వారు వ్యవస్థలో భాగం కాదు. అందుకే మేము కుల గణనను డిమాండ్ చేస్తున్నాము’’ అని అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన అనేది ఓబీసీలు, దళితుల భాగస్వామ్యం పరిపాలనలో, ఇతర రంగాల్లో ఎంత మేర ఉందో అని తెలుసుకునేందుకు సాయపడుతుందని చెప్పారు.

కులగణన లక్ష్యం వివిధ కులాల గణన గురించి మాత్రమే కాదని, దేశ సంపదలో వారి భాగస్వామ్యం గురించి తెలుసుకోవడమని అన్నారు. బీహార్ ప్రభుత్వం చేసిన కుల సర్వే ప్రజల్ని మోసం చేయడానికే అని కాంగ్రెస్ నేత ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన వారికి రిజర్వేషన్ 50 శాతం పరిమితి సరిపోదు అని అన్నారు. మెజారిటీ ప్రజల ప్రయోజనం కోసం కాంగ్రెస్ రిజర్వేషన్లను పెంచుతుందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలు దేశంలోని అన్ని వ్యవస్థల్లోకి చేరాయని, రాజ్యాంగాన్ని కాపాడుకునే వారికి ద్వేషాన్ని వ్యాప్తి చేసే వారికి మధ్య పోరాటం జరుగుతోందని ఆయన అన్నారు.