Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Caste Survey Under Nitish Kumar Was To Fool People Of Bihar Rahul Gandhi

Rahul Gandhi: “కులగణన”తో మోసం.. నితీష్‌ కుమార్‌పై రాహుల్ గాంధీ ఆరోపణ

Published Date :January 18, 2025 , 7:52 pm
By Venu Goapl Reddy
  • ‘‘కుల గణన’’తో బీహార్ ప్రజల్నిమోసం చేశారు..
  • సీఎం నితీష్ కుమార్‌పై రాహుల్ గాంధీ ఆరోపణలు..
Rahul Gandhi: “కులగణన”తో మోసం.. నితీష్‌ కుమార్‌పై రాహుల్ గాంధీ ఆరోపణ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rahul Gandhi: బీహార్‌లో నితీష్ కుమార్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన ప్రజల్ని మోసం చేయడానికే అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో అభివృద్ధి పనులు చేయడానికి కులగణన అనేది చాలా అవసరమని అన్నారు. శనివారం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తమ పార్టీ కులగణనకు కట్టుబడి ఉందని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో రాజ్యాంగాన్ని అణగదొక్కాలని చూస్తు్న్నాయని, అణగారిన వర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు.

Read Also: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ దాడి కేసు.. ఛత్తీస్‌గఢ్‌లో నిందితుడి అరెస్ట్..

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ‘‘నిజమైన స్వాతంత్ర్యం’’ వ్యాఖ్యలు దేశ రాజ్యాంగానికి విరుద్ధం అని అన్నారు. పాట్నాలోని బాపు సభగర్‌లో జరిగిన ‘‘సంవిధాన్ సురక్ష సమ్మేళన్’’లో ఆయన మాట్లాడారు. ‘‘ఈ దేశంలో దళితులు, మైనారిటీలు, సామాజికంగా అణగారిన ప్రజలు 90 శాతం ఉన్నారు, కానీ వారు వ్యవస్థలో భాగం కాదు. అందుకే మేము కుల గణనను డిమాండ్ చేస్తున్నాము’’ అని అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన అనేది ఓబీసీలు, దళితుల భాగస్వామ్యం పరిపాలనలో, ఇతర రంగాల్లో ఎంత మేర ఉందో అని తెలుసుకునేందుకు సాయపడుతుందని చెప్పారు.

కులగణన లక్ష్యం వివిధ కులాల గణన గురించి మాత్రమే కాదని, దేశ సంపదలో వారి భాగస్వామ్యం గురించి తెలుసుకోవడమని అన్నారు. బీహార్ ప్రభుత్వం చేసిన కుల సర్వే ప్రజల్ని మోసం చేయడానికే అని కాంగ్రెస్ నేత ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన వారికి రిజర్వేషన్ 50 శాతం పరిమితి సరిపోదు అని అన్నారు. మెజారిటీ ప్రజల ప్రయోజనం కోసం కాంగ్రెస్ రిజర్వేషన్లను పెంచుతుందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలు దేశంలోని అన్ని వ్యవస్థల్లోకి చేరాయని, రాజ్యాంగాన్ని కాపాడుకునే వారికి ద్వేషాన్ని వ్యాప్తి చేసే వారికి మధ్య పోరాటం జరుగుతోందని ఆయన అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bihar
  • Caste survey
  • CM Nitish Kumar
  • rahul gandhi
  • Rahul Gandhi News

తాజావార్తలు

  • Supreme Court: ‘సర్’ అధికారుల్ని బంధిస్తారా? బెంగాల్ సర్కార్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

  • Lakshmi Manchu: ఆ విషయంలో నా భర్త జంకుతాడు..

  • Tollywood : టాలీవుడ్ లో పైరసీ కలకలం.. ఫిలిం ఛాంబర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

  • Rakasa : రాకాస ‘ప్రీ-రిలీజ్’ షాక్.. థియేట్రికల్ హక్కులకే అన్ని కోట్లా? నిహారిక క్రేజ్ మామూలుగా లేదు!

  • LPG Ship: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త.. విశాఖ పోర్టుకు చేరుకున్న మరో భారీ ఎల్పీజీ నౌక!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions