Puja khedkar: పూజా ఫ్యామిలీని వెంటాడుతున్న కష్టాలు.. తాజాగా తండ్రిపై ఎఫ్ఐఆర్
- పూజా ఖేదర్ ఫ్యామిలీని వెంటాడుతున్న కష్టాలు
- తాజాగా తండ్రి దిలీప్ ఖేద్కర్‌పై ఎఫ్ఐఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఫ్యామిలీని కేసులు కష్టాలు వెంటాడుతున్నాయి. పూజా ఇప్పటికే ఉద్యోగాన్ని కోల్పోవడమే కాకుండా క్రిమినల్ కేసులో పీకల్లోతు కష్టాల్లో ఉంది. వివాదాలు వెంటాడుతున్న సమయలోనే పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఓ అన్నదాతను తుపాకీతో బెదిరించిన కేసులో జైలుకెళ్లింది. ఇప్పుడు తండ్రి దిలీప్ ఖేద్కర్ వంతు వచ్చింది. పూణె కలెక్టరేట్లో విధి నిర్వహణలో ప్రభుత్వోద్యోగిని బెదిరించి.. పనులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై తహసీల్దార్ స్థాయి అధికారి బండ్‌గార్డెన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో దిలీప్ ఖేద్కర్‌పై కేసు నమోదైంది. దిలీప్ ఖేద్కర్‌పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.
2023 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన పూజా ఖేద్కర్‌కు సొంత ప్రాంతం పూణెలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పోస్టింగ్ పడింది. ప్రొబేషనరీ సమయంలో రెండేళ్ల పాటు ఎలాంటి సౌకర్యాలు ఉండవు. కానీ పూజా తండ్రి దిలీప్ మాత్రం.. కలెక్టరేట్‌లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ అధికారుల్ని బెదిరించి కుమార్తెకు సకల సౌకర్యాలు ఏర్పాట్లు చేయాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆయనపై తాజాగా తహసీల్దార్ దీపక్ అకాడే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెదిరింపుల సమయంలో దురుసుగా ప్రవర్తించారని.. అంతేకాకుండా పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు లేకపోయినప్పటికీ కూతురికి క్యాబిన్ కేటాయించాలని అడిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఆ కేసులో దిలీప్ ఖేద్కర్ ముందస్తు బెయిల్‌కు అప్లై చేసుకోగా.. ఆయనకు బెయిల్ మంజూరు అయింది. ఇక ఆయన భార్య మనోరమ ఇటీవలే బెయిల్‌పై విడుదలైంది. దిలీప్ ఖేద్కర్ గత లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎన్నికల అఫిడవిట్లో రూ.60 కోట్లు ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.
Also Read
- Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
- Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్‌తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- Sakshi Jha: సాక్షి ఝా 'మ్యాన్ హేటర్' వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
ఇదిలా ఉంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇటీవల పూజ ఖేద్కర్ ఎంపికను రద్దు చేసింది. భవిష్యత్తులో జరిగే అన్ని పరీక్షలు, ఎంపికల నుంచి ఆమెను శాశ్వతంగా డిబార్ చేసింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 కోసం ఆమె చేసిన దరఖాస్తులో సమాచారాన్ని తప్పుగా సూచించారని ఆరోపణలపై ఢిల్లీలో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పూజా ఖేద్కర్ ఎక్కడుందో ఎవరికీ తెలియదు. దుబాయ్ పారిపోయినట్లుగా వార్తలు వినిపిస్తు్న్నాయి. మరోవైపు యూపీఎస్సీ చర్యను సవాల్ చేస్తూ పూజా ఖేద్కర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేసినట్లుగా తనకు ఎలాంటి కాపీ అందలేదని ఆమె న్యాయస్థానంలో తెలిపింది.
తాజావార్తలు
-
CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
-
Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
-
Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
-
Pawan Kumar Chandana: మ్యాథ్స్‌లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
-
Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!