Canada sanctions Gotabaya, Mahinda Rajapaksa: శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స, మాజీ ప్రధాని మహీందా రాజపక్సేలపై కెనడా ఆంక్షలు విధించింది. దేశంలో అంతర్యుద్ధం సమయంలో ‘‘మానవహక్కుల’’ ఉల్లంఘనలకు పాల్పడ్డారనే అభియోగాలఅపై వీరిద్దరిపై ఆంక్షలు విధించింది. వీరితో పాటు మరో నలుగురికి కూడా ఇదే ఆంక్షలను వర్తింపచేసింది. స్టాఫ్ సార్జెంట్ సునీల్ రత్నాయక్, లెఫ్టినెంట్ కమాండర్ చందనా పి హెట్టియారచ్చితేలపై కూడా ఆంక్షలు విధించినట్లు కెనడా విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ఆంక్షలతో రాజపక్స సోదరులుపై ఆర్థికంగా చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడింది. కెనడాలోని వ్యక్తులు, కెనడా వెలుపల ఉన్న కెనిడియన్లు ఆంక్షలు ఎదుర్కొంటున్న వ్యక్తులతో ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలు పెట్టుకోకుండా నిషేధించింది. ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీ ప్రొటెక్షన్ చట్టం ప్రకారం వీరిని కెనడాలోకి అనుమతించరు. ఇదిలా ఉంటే శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి కారణం అయిన గోటబయ రాజపక్స, ప్రజా ఉద్యమం కారణంగా తన పదవికి రాజీనామా చేసి, దేశం వదిలిపారిపోయాడు. ప్రధానిగా ఉన్న మహీందా రాజపక్స కూడా తన పదవికి రాజీనామా చేశాడు.
Read Also: Kerala: వివాదంలో యూత్ ఫెస్టివల్ సాంగ్.. విచారణకు కేరళ ప్రభుత్వం ఆదేశం..
ప్రత్యేక తమిళదేశం కోసం పోరాడిని శ్రీలంక తమిళులను దారుణంగా ఉచకోత కోసినట్లు రాజపక్స సోదరులు ఆరోపనలు ఎదుర్కొంటున్నారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎట్టీటీఈ) ఆధ్వర్యంలో 1983 నుంచి 2009 వరకు 26 ఏళ్ల పాటు అంతర్యుద్ధం జరిగింది. అయితే ఆ సమయంలో అధ్యక్షుడిగా మహీందా రాజపక్స ఉండటంతో పాటు సైన్యంలో గోటబయ రాజపక్స కీలక స్థానంలో ఉన్నారు. వీరిద్దరు కూడా తమిళ టైగర్స్ ఊచకోతలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2009లో శ్రీలంక సైన్యం ప్రభాకరన్ ను చంపేసింది. దీంతో తమిళ ప్రత్యేక ఉద్యమానికి తెరపడింది. శ్రీలంక సైన్యం తమిళ మహిళలు, పిల్లలపై అత్యాచారాలకు ఒడిగట్టారు. అత్యంత దారుణంగా తమిళులను హతమార్చారు.
