Canada sanctions Gotabaya, Mahinda Rajapaksa: శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స, మాజీ ప్రధాని మహీందా రాజపక్సేలపై కెనడా ఆంక్షలు విధించింది. దేశంలో అంతర్యుద్ధం సమయంలో ‘‘మానవహక్కుల’’ ఉల్లంఘనలకు పాల్పడ్డారనే అభియోగాలఅపై వీరిద్దరిపై ఆంక్షలు విధించింది. వీరితో పాటు మరో నలుగురికి కూడా ఇదే ఆంక్షలను వర్తింపచేసింది. స్టాఫ్ సార్జెంట్ సునీల్ రత్నాయక్, లెఫ్టినెంట్ కమాండర్ చందనా పి హెట్టియారచ్చితేలపై కూడా ఆంక్షలు విధించినట్లు కెనడా విదేశాంగ శాఖ తెలిపింది.