Indi vs Canada: ప్రో- ఖలీస్తాన్ పౌరులే లక్ష్యంగా చేసుకుని నేర కార్యకలాపాలకు భారత్ మద్దతు ఇస్తోందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగిన దగ్గరి నుంచి భారత్‌తో గొడవకు కెనడా ప్రయత్నిస్తుంది. తన బుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. ఇప్పుడు ఏకంగా భారత్‌పై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ఆ అర్థం వచ్చేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్ణయం తీసుకోవడానికి తాము రెడీగా ఉన్నామంటూ రెచ్చగొట్టేలా కెనడా విదేశాంగ మంత్రి జోలీ రియాక్ట్ అయ్యారు.
Read Also: North Korea: రోడ్లను పేల్చేసిన నార్త్ కొరియా.. మండిపడిన దక్షిణ కొరియా..
కాగా, హర్థీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ పై చేసిన ఆరోపణలకు సంబంధించిన సమాచారాన్ని యునైటెడ్ స్టేట్స్‌తో సహా ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ భాగస్వాములతో పంచుకున్నట్లు ట్రూడో పేర్కొన్నారు. అలాగే, భారత ప్రభుత్వం కెనడాలోని వ్యవస్థీకృత క్రైమ్ గ్రూపులతో కలిసి పని చేస్తోందని.. దోపిడీ, హత్య లాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఇక, కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యలకు ఇండియా ఘాటుగా స్పందించింది. తప్పుడు ఆరోపణలు చేస్తే.. తీవ్ర పరిణామాలన ఎదుర్కొవల్సి వస్తుందని హెచ్చరించింది.